Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూరుఎస్
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు మాత్రమే గ్రామాల్లో కనిపిస్తున్నాయే తప్ప కేసీఆర్ 9 ఏండ్లలో ఏ ఒక్క ఇండ్లు నిర్మించి ఇవ్వలేదని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేశ్‌రెడ్డి అన్నారు.హాత్ సే హాత్ పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఆత్మకూరు ఎస్ మండలంలోని పాత సూర్యాపేట, శంకన్నగూడెం గ్రామాల్లో పర్యటించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సొంతింటి స్థలం ఉన్న పేదవారికి ఇండ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల సాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టమని, ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిస్తామన్నారు.నియోజకవర్గంలో 900 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలోనూ ట్యాంక్‌బండ్, రోడ్ల నిర్మాణం ప్రతి పనిలో అడ్డగోలుగా అవినీతి జరుగుతుందని ఆరోపించారు.రాబోయే ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేస్తామని ఆశీర్వదించాలని కోరారు.బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణితో రైతులు ఇబ్బంది పడుతున్నారని, రైతులు తమ తాత, ముత్తాతల కాలం నుండి కబ్జాలో ఉన్నప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇతరుల పేరిట తమ భూములు రికార్డులలో ఎలా ఎక్కుతాయని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ధరణిని రద్దుచేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే వెంటనే ధరణిని రద్దు చేస్తామన్నారు. ఈ సందర్భంగా శంకన్నగూడెం సమీపంలో గీత కార్మికుల వేషధారణలో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మండలఅధ్యక్షులు గోపాల్‌రెడ్డి,షఫీఉల్లా, గట్టు శ్రీనివాస్, స్వామినాయుడు,నామ ప్రవీణ్, సైదిరెడ్డి,పరుశరామ్,ధరావత్ వెంకన్న నాయక్ మల్లారెడ్డి,గుణగంటి మల్సూర్ అరవింద్‌రెడ్డి, లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.