Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
పాలు కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఆహార భద్రత తనిఖీ అధికారి కల్యాణ్‌చక్రవర్తి అన్నారు.శుక్రవారం జిల్లా పరిధిలోని పాల విక్రయకేంద్రాలను జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలించారు.కోదాడలోని పలు పాల కేంద్రాలలో పాలనమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాదులోని ల్యాబ్‌కు పంపించారు. అనంతరం కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ పాలను కల్తీ చేసి అమ్మడం చట్ట విరుద్ధమన్నారు.పాలలో నురగ రావడానికి, కొవ్వు శాతం పెరగడానికి ఎవరైనా తప్పుడు పద్ధతులు పాటించకూడదన్నారు.స్వచ్ఛమైన సహజ సిద్ధమైన పాలను అమ్మాలన్నారు.సాధారణ తనిఖీల్లో భాగంగా కొన్ని డెయిరీలలో పాల నమూనాలు సేకరించి నట్టు తెలిపారు.పాలు, పాల ఉత్పత్తులు ఎవరైనా కల్తీ చేసినట్లు తెలిస్తే సమాచారం అందించాలన్నారు.వీరి వెంట స్పెషల్ డ్రైవ్ ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి, ఖాజా లతీఫ్ తదితరులు ఉన్నారు.