Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
మండలంలోని సోమవారం గ్రామంలో నెలకొన్న శ్రీ బృమాలిక సోమప్ప సోమేశ్వర జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి శుక్రవారం పరిశీలించారు.దివ్య క్షేత్రాన్ని సందర్శించి దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ శనివారం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా సోమప్ప క్షేత్రంలో ఏర్పాటు చేసిన పనులను పరిశీలించి ఆలయకమిటీతో తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆరా తీశారు.భక్తులకు ఎలాంటి ఆసౌకర్యాలు లేకుండా చూడాలని ఆలయ చైర్మెన్ రాచకొండ శ్రీనివాసరావుకు సూచించారు.మండల నాయకులు అందరూ కలిసి సోమప్ప ఉత్సవాలను సమన్వయంతో విజయవంతం చేయాలని కోరారు.దేవాలయాన్ని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తానే స్వయంగా అంచెలు అంచెలుగా అభివృద్ధి చేశానన్నారు.గుడిని, పరిసరాలను సుందరంగా ఆధ్యాత్మికంగా తీర్చిదిద్ది శ్రీ సోమప్ప దివ్య దర్శనాన్ని భక్తులకు సులువుతరం చేయడం వలన సోమప్ప దేవాలయానికి భక్తుల రాక పెరిగినదన్నారు.ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల పట్టణ అధక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి మున్సిపల్ చైర్మెన్ చందమల్ల జయబాబు, జెడ్పీటీసీ రాపోలునర్సయ్య, ఎంపీపీ జ్యోతి, వైస్‌ఎంపీపీ తాళ్లూరి లక్ష్మి నారాయణ, మండల అధ్యక్షుడు సురేష్‌బాబు, సింగిల్ విండో చైర్మెన్లు అనంతు శ్రీనివాస్‌గౌడ్, శాఖమూరి శ్రీకాంత్, కల్లూరు సర్పంచ్ పల్లెపంగు. నాగరాజు, నందిపాటి నాగగురవయ్య పాల్గొన్నారు.