Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 55 లక్షల 284 కేజీల గంజాయి పట్టివేత
- ఒక కారు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం
- ఎస్పీ కె.అపూర్వ రావు
నవతెలంగాణ -నల్లగొండ
అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన అంతర్ రాష్ట్ర నిందితుడు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ కె.అపూర్వరావు చెప్పారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 16న సాయంత్రం 6 గంటల సమయంలో పెద్దవూర పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా మాచర్ల ఆంధ్ర ప్రాంతం నుండి హైదరాబాద్ కు వెళ్తున్న ఒక హుందారు వెర్ణ కారు నెంబర్ టీఎన్74- ఏవీ-6800 గల కారు ఆపి తనిఖీ చేయగా గంజాయి ప్యాకెట్లు ఉన్నట్టు గుర్తించారు. 142 గంజాయి పాకెట్లను ఒక్కొక్కటి 2 కేజీలతో మొత్తం 284 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని అందులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. తమిళనాడు రాష్ట్రం పెరియార్‌నగర్ శక్తి ఇల్లామ్ గ్రామానికి చెందిన శక్తితనిగైరాజ ఆంధ్రా ప్రాంతలోని రాజమండ్రి దగ్గర నర్శిపట్నంకి చెందిన తనకు పరిచయం ఉన్న వీర బాబు, కృష్ణ వద్ద నుండి ఒక్కొక్కటి 2 కిలోలు తూకం గల 142 గంజాయి పాకెట్లను కొనుక్కొని కారులో తీసుకెళ్తుండగా రాజమండ్రి నుంచి తమిళనాడు వెళ్లే క్రమంలో బోలపల్లి టోల్‌ప్లాజా వద్ద ఆంధ్రప్రదేశ్ పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా స్లిప్ ఇచ్చి టోల్‌గేట్‌ను ఢకొీట్టి దారి మళ్లించి మాచర్ల మీదుగా నాగార్జునసాగర్లోకిప్రవేశించాడు. అప్రమత్తమైన నాగార్జున సాగర్ పోలీసులు నాగార్జునసాగర్‌లో అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వెంబడించి పెద్దవూర వద్ద పట్టుకుని142 గంజాయి పాకెట్లతో పాటు కారు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. చాకచక్యంగా వ్యవహారించి గంజాయి రవాణా చేస్తున్న నిందితుడిని పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి,ఇన్స్పెక్టర్ నాగరాజు, పెద్దవూర ఎస్ఐ పచ్చిపాల పరమేష్, హెచ్‌సి శంకర్‌బాబు, పీసీ కిషన్, హెచ్‌జి మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.