Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దఅడిశర్లపల్లి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అలుపెరుగని పోరాట యోధుడని,ఆయన సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ప్రయాణిస్తుందని ఎంపీపీ వంగాల ప్రతాపరెడ్డి,పీఎసీఎస్ చైర్మెన్ వల్లపురెడ్డి అన్నారు.శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా మండల కేంద్రంలోని గాంధీచౌక్ వద్ద వారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి తోటకూరి పరమేష్ యాదవ్,ఎంపీటీసీ బన్సీలాల్, సర్పంచ్ శివాజీ నాయక్, పీఎసీఎస్ వైస్‌చైర్మెన్ శిరసవాడ శ్రీనయ్య, నాయకులు ఎన్.లచ్చిరెడ్డి, నర్సింహ, సుధాకర్‌రెడ్డి,టి. మణిపాల్‌రెడ్డి,చంద్రునాయక్,రమేష్‌నాయక్,జి. శ్రీనివాస్,బి. మహేందర్, శ్రీనునాయక్, కొండల్‌యాదవ్, జానారెడ్డి, సుధాకర్‌గౌడ్ పాల్గొన్నారు.
నాగార్జునసాగర్ : నందికొండ మున్సిపాలిటీ స్థానిక కౌన్సిలర్ల ఆధ్వర్యంలో కమలా నెహ్రూ దవాఖానలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి బాలింతలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వెనిగండ్ల పీఏసీఎస్ చైర్మెన్ కె.వి రామారావు,తిరుమలగిరి ఎంపీపీ భగవాన్‌నాయక్,మన్నెం రంజిత్ యాదవ్,పెద్దవూర ఎంపీపీ ముఖ్య సలహాదారుడు సుందర్‌రెడ్డి, నందికొండ కౌన్సిలర్స్ ఈర్ల రామకృష్ణ, రమేష్‌జీ, మంగ్తానాయక్, ఆదాస్ నాగరాణి విక్రమ్,ఏఐబీఎస్ఎస్ పట్టణ అధ్యక్షుడు మోహన్ నాయక్,ఎస్సీ రాష్ట్ర నాయకులు ఆదాసు విక్రమ్, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ భాను ప్రసాద్‌నాయక్,నాయకులు అల్లి పెద్దిరాజుయాదవ్, అంజి,శివ,రమణ, మల్లికార్జున్,రాజు,వీరయ్య ,సైదులు, తదితరులు పాల్గొన్నారు.
నాంపల్లి:మండలకేంద్రంలో బీఆర్ఎస్ మండలకమిటీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదినవేడుకలు ఘనంగా నిర్వహించారు.మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుమ్మడపు నర్సింహారావు,పార్టీ ప్రధాన కార్యదర్శులు కోరే యాదయ్య, పచ్చిపాల రామాంజనేయులు, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు సర్దార్, సర్పంచులు జిల్లెల్ల యాదమ్మ సైదులు, అందుగుల కవిత యాదయ్య, బుషిపాక లీలా ప్రియా నగేష్, రాపోతు దేవేంద్ర సత్యనారాయణ , పిఎసిఎస్ డైరెక్టర్ బెల్లి సత్తయ్య , బీఆర్ఎస్ నాయకులు నాయిని శేఖర్‌రెడ్డి, సూదనబోయిన పర్వతాలు, యండి సలీం, సంగెపు గణేష్, గ్రామ శాఖ అధ్యక్షులు నాంపల్లి సత్తయ్య, బొల్లంపల్లి సుధీర్, భిక్షం, గంజి సంజీవ, పంగనూరి మల్లిఖార్జున్, పూల చక్రధర్, వెంకటయ్య, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
వేములపల్లి: మండలంలోని శెట్టిపాలెం గ్రామంలో కట్ట యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.మండల కేంద్రంలో మొక్కలు నాటారు.శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలఅధ్యక్షులు నామిరెడ్డి కర్నాకర్‌రెడ్డి,జిల్లా నాయకులు కట్ట మల్లేష్‌గౌడ్, జెడ్పీటీసీ ఇరుగు మంగమ్మవెంకటయ్య, సర్పంచ్ లు మజ్జిగపు పద్మ సుధాకర్‌రెడ్డి, చీర మల్లయ్యయాదవ్,ఉపసర్పంచ్ కట్టమట్టమ్మ, అవిరెడ్డిపద్మ శేఖర్‌రెడ్డి, నాగవల్లి శంకర్, పందిరి ప్రతాప్, ఉగ్గె మునీశ్వర్, గౌరు శ్రీనివాస్, కాట్రగడ్డ గోపాల్‌రావు, నక్క శేఖర్, పెద్దపంగ సైదులు, మజ్జిగపు వెంకట్‌రెడ్డి, కట్ట వినరు, బొడ్డుసాయి, శిరస్సు సైదులు, చిరుమర్రి నాగయ్య, కొరదాల నగేష్ తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడరూరల్: మిర్యాలగూడలోని బాపూజీనగర్ ప్రభుత్వపాఠశాలలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ధీరావత్ హన్యా నాయక్, రమాబాయి, ప్రధానోపాధ్యాయులు నాగరాజు, టీచర్లు పాల్గొన్నారు.
మర్రిగూడ : మండలకేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.కేక్ కట్ చేసి, ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటి, రోగులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, మాల్ మార్కెట్ కమిటీ చైర్మెన్ దంటు జగదీశ్వర్, వైస్ ఎంపీపీ కట్కూరు వెంకటేశం, మాజీ ఎంపీపీ అనంతరాజు గౌడ్, రైతుబంధు సమితి కన్వీనర్ బచ్చు రామకృష్ణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోటకూరి శంకర్, మర్రిగూడ సర్పంచ్ నల్ల యాదయ్య, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల టౌన్:రాష్ట్ర ముఖ్యమంత్రికల్వకుంట్ల చంద్రశేఖర రావు గ69వ జన్మదిన సందర్భంగా చిట్యాల పట్టణ కేంద్రంలో స్థానిక కనకదుర్గమ్మ సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ మండలం ,పట్టణ శాఖ ఆధ్వర్యంలోో మున్సిపల్చైర్మెన్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని జెడ్పిటిసి ఎంపిపి మండల పార్టీ అధ్యక్షులతో కలిసి కేక్‌కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ జడల అది మల్లయ్య, మండల అధ్యక్షులు ఆవుల ఐలయ్య , కొలను వెంకటేశం, సుంకరి యాదగిరి మున్సిపల్ వైస్ చైర్మన్. కూరెళ్ళ లింగస్వామి, బెల్లి సత్తయ్య ,మెండే సైదులు,కోనేటి కృష్ణ, పందిరి రమేష్ ,పొన్నం లక్ష్మయ్య, జిట్ట చంద్రకాంత్ , ఎండి షుకుర్ ,రుద్రవరం యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలోని కనకదుర్గ సెంటర్లో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని నకిరేకల్ మాజీ శాసనసభ్యులు, ఉద్దీపన ఫౌండేషన్ చైర్మెన్ వేముల వీరేశం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ పూజార్ల శంబయ్య తో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బట్టు ఐలేష్, కాటం వెంకటేశం, ఎద్దులపూడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.