Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చింతపల్లి
ప్రభుత్వం అందించే సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని మత్స్యకారుల పారిశ్రామిక సహకార సంఘం నల్గొండ జిల్లా ఏడీ వెంకయ్య అన్నారు.శుక్రవారం మండలంలోని కురుమేడి గ్రామంలో మత్స్యకారుల సహకార సంఘం కురుమేడులో నూతన సొసైటీ ఆధ్వర్యంలో వారికి ట్రైనింగ్ ఇచ్చి సభ్యత్వ నమోదు చేసుకున్నారు.ఈ సందర్భంగా ఏడీ వెంకటయ్య మాట్లాడారు.ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.వ ుత్స్యకారులకు ఏమైనా జరిగితే వారి భార్య పిల్లలకు ప్రభుత్వం తరపున ఇన్సూరెన్స్ వస్తుందని తెలిపారు.అదే విధంగా సొసైటీ ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్,సభ్యత్వం కలిగి ఉంటే వారి కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థికసాయం లబ్బిపొందుతారన్నారు.ఈ కార్యక్రమంలో మత్స్యకారుల సహకార సంఘం అధ్యక్షులు చేపూరి వెంకటేష్, ఉపాధ్యక్షుడు యాదయ్య, కార్యదర్శి పోలేమన్శేఖర్, తవిటి శ్రీను మాంకాల సత్తయ్య, భాస్కర్,కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.