Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూర్ఎస్
రైతు సంక్షేమం పేరుతో కొందరు పాదయాత్రలు రైతు రుణమాఫీలు, రైతుబంధులు, ఓసారి రంగానికి సబ్సిడీలు అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకప్పుడు ఉపన్యాసాలు చేస్తూ ఉన్నప్పటికీ యూరియా కోసం రైతులు పోరాటాలు తప్పడం లేదు.శుక్రవారం ఆత్మకూరు ఎస్ మండలం ఏపూర్, నెమ్మికల్ పీఏసీఎస్ కేంద్రంలో అగచాట్లు పడుతున్నారు.యూరియా సప్లైలో అంతరాయం ఏర్పడడం కారణంగా కొద్దిరోజులుగా యూరియా కోసం రైతులను ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గతంలో కంటే ఏడాది యూరియా సప్లైలో కోత ఉండడం కారణంగా రైతులకు సరైన మోతాదులో దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు సరిపడా యూరియా అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు.