Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండడెస్క్
విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రతిభ పరీక్షా నిర్వహించినట్లు దేవరకొండ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు, రమావత్ లక్ష్మణ్,బుడిగ వెంకటేశ్ అన్నారు. ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో దేవరకొండ మండలంలోని వివిధ ప్రభుత్వ ,ప్రైవేటు పాఠశాలలో శుక్రవారం విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రతిభ పరీక్షలు నిర్వహించామన్నారు.త్వరలో పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థిని ,విద్యార్థులకు ఒక మార్గదర్శకంగా ఉంటుందని అన్నారు. సమస్యలపై పోరాడుతూనే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని, పరీక్షకు విద్యార్థులను మంచి స్పందన రావడం గర్వకారణం అన్నారు .రానున్న రోజులలో విద్యార్థులకు అభ్యున్నతికి ఉపయోగపడే పరీక్షలు మరెన్నో నిర్వహిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో నేనావత్ బాబులాల్, కుర్ర రాహుల్, ఎండి సుభాన్ ,అందుగుల రాజు, శ్రవణ్, చందు, తదితరులు పాల్గొన్నారు.