Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ ఎస్ వెంకట్రావు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
పల్లెప్రగతి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయాలనికలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు.శుక్రవారం కలెక్టరేట్ నందు సూర్యాపేట రెవెన్యూ డివిజన్ సంబంధించిన 11 మండలాల ఎంపీడీవోలు, ఎంపీఒలు, ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు,పంచాయతీ సెక్రెటరీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమాల అమలు సమర్థవంతంగా ఉండాలని తెలిపారు.జిల్లాలో నిర్మాణం పూర్తి కాకుండా ఇంకా ఒక్క వైకుంఠదామం కూడా మిగిలి ఉండకూడదన్నారు. మిగిలి ఉంటే ఎంపీడీఓ,ఎంపీవో, ఏఈ పీఆర్, పంచాయతీ కార్యదర్శి, సర్పంచులే బాధ్యులవుతారన్నారు.ఇంకా నిర్మాణం పూర్తికాని వైకుంఠదామాలు ఏమైనా ఉంటే వెంటనే వాటి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.వైకుంఠదామాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ప్రజల నుండి సహకారం లేనట్టయితే గ్రామసభలు పెట్టి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.జిల్లాలోని అన్ని సెగ్రిగేషన్ షెడ్లను 100 శాతం ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. సిస్టమాటిక్, సైంటిఫిక్ మ్యానర్‌లో వీటిని వినియోగించాలని పేర్కొన్నారు. జిల్లాలోని గ్రామపంచాయతీలలో ఇది ఎందుకు సాధ్యం కావడం లేదని అసంతప్తి వ్యక్తం చేశారు. ఇప్పటినుండి ప్రతి జీపీలోని సెగ్రిగేషన్షెడ్ను 100 శాతం వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.అన్ని సెగ్రిగేషన్ షెడ్లలో వర్మి కంపోస్ట్ ఎరువు తయారు చేయాలని ఆదేశించారు.ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటానని సూచించారు.ఉపాధి హామీ పనులకు లేబర్‌ను ఎక్కువ సంఖ్యలో మొబిలైజ్ చేయాలన్నారు.దీనిని ఎంపీడీవోలు ప్రతిరోజు పర్యవేక్షించాలన్నారు.ఏపీఓ, ఎంపీఓలు కూడా భాగస్వామ్యం కావాలని అన్నారు. ప్రతి సోమవారం ఉదయం గం.10.00 నుండి మద్యాహ్నం గం.01.00 వరకు ప్రతి మండలకేంద్రంలోని తహసీల్దార్ ఆఫీసులో కానీ,మండల పరిషత్తు ఆఫీసులో కానీ ప్రజావాణి కార్యక్రమంంలో ఇంజనీరింగ్ అధికారులతో సహా అన్ని డిపార్ట్మెంటులకు సంబంధించిన మండల స్థాయి అధికారులు పాల్గొనాలన్నారు.తహసీల్దార్లు, ఎంపీడీఓలు వెబెక్స్‌లో లాగిన్ అయి ఉండాలన్నారు.యాప్ అందరూ మండల లెవెల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు,ఫీల్డ్ అసిస్టెంట్లు,సర్పంచులు డౌన్లోడ్ చేసుకుని సిద్ధంగా ఉండాలన్నారు. ప్రత్యేక సమావేశాలు వెబ్ఎక్స్ ద్వారా కూడా నిర్వహిస్తామన్నారు.ప్రభుత్వ లక్ష్యాలను గ్రామాలలో సక్రమంగా నెరవేర్చేందుకు మండల, గ్రామ అధికారులందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్,జెడ్పీ సీఈఓ సురేష్, డీఎఫ్ ఓ సతీష్, మండల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.