Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్రప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ -వలిగొండ రూరల్
గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికుల సమస్యల పరిష్కారంకోసం చేపట్టిన పాదయాత్ర శుక్రవారం యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని మొగిలి పాక, వెల్వర్తి గ్రామాల్లో కొనసాగింది. వెల్వర్తి గ్రామంలో తూర్కపల్లి సురేందర్ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్నా 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి 4లేబర్ కోడ్లు తెచ్చిందన్నారు. ఈ లేబర్ కోడ్ ల వల్ల గ్రామ పంచాయతీ సిబ్బంది కీ చట్టాలు వర్తించకుండా కుట్ర పన్నిందన్నారు. గ్రామపంచాయతీలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, 10 లక్షల ప్రమాద బీమా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది అత్యధికులు దళితులు, గిరిజనలు, బలహీన వర్గాలకు చెందిన పేద వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారని వారికీ కనీస వేతనం ఇవ్వకుండా వారి శ్రమను ప్రభుత్వం దోచుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. ప్రభుత్వం 4లేబర్ కోడ్ లు రద్దు చేసి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సిబ్బందికి ఉద్యోగభద్రత ఈఎస్ఐ, పీఎఫ్ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం కేర్చిపల్లి, పులిగిల్ల గ్రామంలో పాదయాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో పాదయాత్ర బృందం గ్రామ పంచాయతీ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గ్యార పాండు, చాగంటి వెంకటయ్య, తునికి మహేష్, వినోద్ కుమార్, సుధాకర్ , సీఐటీయూ మండలనాయకులు. ఆర్ మల్లేశం, ఎస్ రాంచంద్రం, నాగేష్, ఉక్కుర్తి. స్వామి, శంకర్, కుమార్, నర్సింహా, ముత్యాలు, ఎల్లమ్మయ్య, యాదయ్య,పుష్ప, హేమలత మరియు ప్రజాసంఘాలనాయకులు. సిరిపంగి. స్వామి, కందడి. సత్తిరెడ్డి, మెరుగు. వెంకటేష్, మొగిలిపాక గోపాల్, కలుకూరి ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూలో పలువురి చేరిక
గ్రామ పంచాయతీ సిబ్బంది పాదయాత్ర వెల్వర్తి గ్రామానికి విచ్చేసిన సందర్బంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ సమక్షంలో వలిగొండ పట్టణ పారిశుధ్య కార్మికులు బీఆర్ఎస్కేవీ నుండ ిసీఐటీయూలో చేరారు. ఈ సందర్బంగా భాస్కర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల హక్కుల కొరకు నిరంతరం పోరాటం చేస్తూ వారి హక్కులు సాధించడం కోసం సీఐటీయూ ముఖ్యమై న పాత్ర పోషిస్తున్నదన్నారు. చేరిన వారిలో పోలేపాక. రాములు, శ్రీరాములు, లలిత, రేణుక, లక్ష్మయ్య, ఎల్లంకి స్వామి, సాయిలు, నర్సింహా, లక్ష్మమ్మ,తదితరులు ఉన్నారు.