Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
పట్టణంలోని పినాకిల్ పాఠశాల ఆధ్వర్యంలో మేరా భారత్ మహాన్, గ్రాండ్ పేరేంట్స్ కార్యక్రమాన్ని ఏ-1 ఫంక్షన్‌హాలులో శుక్రవారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విభిన్న సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. అలాగే భారతీయ వైవిధ్యత ను భవిష్యత్ తరాలు అందుకోవల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందంటూ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. మానవత్వాన్ని ప్రదర్శించడమే అసలైన దేశ భక్తి అని చెప్పుకునే విధంగా విద్యార్థులు చాటి చెప్పారు.భారతీయతను కాపాడడమే తమ లక్ష్యమని చెప్పారు.మర్చిపోతున్న జ్ఞాపకాల గుండె సవ్వడిని తమ పలుకుల ద్వారా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పినాకిల్ విద్యాసంస్థ చైర్మెన్ మదార్ మాట్లాడుతూ పినాకిల్ పాఠశాల అక్షరాల జ్వాలాతోరణ మన్నారు.భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం ప్రసిద్ధి చెందిందన్నారు.చదువుల తల్లి ఒడిలోకి దేశాన్ని మేల్కొల్పినపుడు.. ప్రతి ఇండ్లూ ఓ నందనవనమవుతుందని ప్రతి ఊరూ ఓ ఆనంద భువనమవుతుందని.. పిల్లల బాల్యం కార్ఖానాలలో కరగనీయక చదువుల వైపు మళ్లించాలని సూచించారు.అనంతరం గ్రాండ్ పేరెంట్స్‌ను సన్మానించారు.ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు,తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.