Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
మండలకేంద్రంలోని శివాలయానికి శనివారం భక్తజనం పోటెత్తారు.భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లో నిల్చున్నారు.బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, వైస్‌ఎంపీపీ జూలకంటి జీవన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మోతె : మండలంలోని శివాలయాలు శివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. కూడలిలో ఉన్న సంగమేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు, ఎమ్మెస్ కళాశాల కరస్పాండెంట్ పందిరినాగిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు శీలం సైదులు,సర్పంచ్ పొనుగోటి నర్సింహారావు, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు ఎస్కె.జానిపాషా, కాంగ్రెస్ నాయకులు ఉసిరికాయల రవిబాబు,కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షులు గంగర బోయిన బాలకృష్ణ, రామాచారి, శంకర్, వీరసామ కిషన్ పాల్గొన్నారు.
నేరేడుచర్ల: మండలంలోని సుప్రసిద్ధ పురాతన శివాలయం శ్రీ, బృగుమాలిక సోమప్ప సోమేశ్వర ఆలయాన్ని శనివారం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సతీసమేతంగా దర్శించారు.మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగాయి. అంతకుముందు ఆలయ అర్చకులు ఇటువంటి శ్రీనివాస శాస్త్రి ఎమ్మెల్యే దంపతులకు పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర ఆలయాన్ని ఎమ్మెల్యే దంపతులు దర్శించి పూజలు నిర్వహించారు. ఆలయచైర్మెన్ రాచకొండ శ్రీనివాసరావు ఎమ్మెల్యే దంపతులను శాలువాలతో సన్మానించి ఆలయ మెమొంటోని అందజేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేరేడుచర్ల పట్టణ అధ్యక్షురాలు చల్లా శ్రీలతరెడ్డి, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మెన్ చందమల్ల జయబాబు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు అరిబండి సురేష్‌బాబు, జిల్లా నాయకులు చింతకుంట్ల సోమిరెడ్డి, ఎంపీపీ జ్యోతి, వైస్‌ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ, చిల్లేపల్లి పీఏసీఎస్ చైర్మెన్ అనంత్ శ్రీనివాస్‌గౌడ్, నాయకులు చిత్తలూరు సైదులు, ఘంటా సైదులు, గుర్రం మార్కండేయయులు పాల్గొన్నారు.
అదేవిధంగా నేరేడుచర్ల లో శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. నేరేడుచర్ల మండలం బూర్గులతండా, సోమారం గ్రామపంచాయతీ పరిధిలోనీ మూసీ నది ఒడ్డున ఉన్న ప్రముఖ శైవక్షేత్రం శ్రీ భృగు మాలిక సోమేశ్వర దేవాలయంలో తెల్లవారుజాము నుండే భక్తులు మూసీ నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, శ్రీ సోమేశ్వర స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. లయన్స్ క్లబ్, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకి అల్పాహారం, మజ్జిగ పంపిణీ చేశారు.నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ మాజీ నియోజకవర్గ ఇన్చార్జి కాసోజు శంకరమ్మ, శ్రీబృగు మాలిక సోమేశ్వర స్వామికి అభిషేకం, ప్రత్యేకపూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.వీరికి సోమప్ప ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో సోమప్ప దేవాలయ కమిటీ చైర్మెన్ రాచకొండ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మెన్ జయబాబు,బీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు చల్లా శ్రీలతరెడ్డి, అరిబండి సురేష్‌బాబు,ఎంపీపీ లకుమల్ల జ్యోతిభిక్షం, జెడ్పీటీసీ రాపోలునర్సయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొనతం చిన్నవెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీ నారాయణ, పీఏసీఎస్ చైర్మెన్లు అనంతు శ్రీనివాస్‌గౌడ్, శాఖమూరి శ్రీకాంత్, తహసీల్దార్ సరిత, ఎంపీడీఓ శంకరయ్య, ఎస్సై నవీన్‌కుమార్, సర్పంచ్ రోజా నాగునాయక్, చిత్తలూరి సైదులు, గంటసైదులు పాల్గొన్నారు.
తిరుమలగిరి : మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మూడవ వార్డు కోటిలింగాలకాలనీ శివాలయం, గణపతి దేవాలయాల్లో బీఆర్ఎస్ మండలఅధ్యక్షులు సంకేపల్లి రఘునందన్‌రెడ్డి ప్రత్యేకపూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నాయకులు మహేశ్వరం సందీప్‌నేత, వార్డు సభ్యులు ఏనుగుల నాగన్న, మల్లేష్, సింగారపు స్వామి, లింగమల్లు తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా మండలంలోని మున్సిపాలిటీ, రూరల్ పరిధిలోని కోటిలింగాల కాలనీలోని మంచులింగ దర్శనం, వినాయక దేవాలయం, గుండెపురి గ్రామ శివాలయం, జలాల్పురం గ్రామంలో గల కాకతీయుల కాలం నాటి శివాలయాలు సందర్శించి ప్రత్యేకపూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్‌కుమార్, బర్ల వెంకన్న, తెడ్డు భాస్కర్, కొమ్మినేని ప్రవీణ్‌కుమార్, జయచందర్, నాని తదితరులు పాల్గొన్నారు.
తుంగతుర్తి: మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లోని ఆలయాలు శివనామ స్మరణతో మార్మోగిపోయాయి. అభిషేక ప్రియుడైన భోళాశంకరుడికి భక్తులు మహావ్యాస రుద్రాభిషేకాలు, అర్చనలు, పూజలు, శివపార్వతుల కల్యాణోత్సవాలను,పాలు,తేనె, నెయ్యి, పంచ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయాలన్నింటిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉదయం నుండి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ఓం నమశ్శివాయ.. శంభో శంకర.. హర హర మహాదేవ అంటూ భక్తి పారవశ్యంతో భక్తులు చేసిన శివనామస్మరణలతో శివాలయాలు మారుమ్రోగాయి. శివ భక్తులు జాగరణ ఉపవాస దీక్షల సందర్భంగా ఆలయాలలోనే సమయం కేటాయించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక భావాన్ని పెంచుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మెన్ పులుసు యాదగిరి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడెం శివాలయంలో దొనకొండ రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సూర్యాపేటరూరల్: చారిత్రాత్మక చరిత్ర కలిగిన పిల్లలమర్రి శివాలయాల్లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. శివనామస్మరణలతో పిల్లలమర్రి ప్రాంతం మారుమోగింది.పిల్లలమర్రి శివాలయాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి,ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,సందర్శించి ప్రత్యేకపూజలు చేశారు. ఉదయం 4 గంటలకు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం,ఎరకేశ్వర స్వామి,త్రికుటేశ్వర స్వామి వారి ఆలయాలలో, మధ్యాహ్నం 1.30 గంటలకు భక్తులు స్వహస్తాలతో అభిషేకాలు, సాయంత్రం 5 గంటలకు ధ్వజారోహణ బసవ ముద్ద,రాత్రి లింగోద్భవ కాలంలో దేవతామూర్తుల కళ్యాణం నిర్వహించారు.పిల్లలమర్రి శివాలయాలకు పెద్ద ఎత్తున భక్తుల తాకిడి పెరగడంతో,సూర్యాపేట సీఐ సోమనారాయణ సింగ్, సూర్యాపేట రూరల్ ఎస్ఐ అర్ సాయిరాం ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. పిల్లలమర్రి శివాలయాల్లో బందోబస్తు తీరును పరిశీలించి అనంతరం శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పెన్‌పహాడ్ :మండలంలోని శివాలయాలన్ని శనివారం మహాశివరాత్రి సందర్భంగా శివ నామస్మరణతో మార్మోగాయి. మండల పరిధిలోని నాగులపహడ్ గ్రామంలోని కాకతీయుల నాటి శ్రీశ్రీశ్రీ త్రికూటేశ్వర ఆలయంలో, అనంతారం, పెన్ పహాడ్ శంభూలింగేశ్వర ఆలయాలు, లింగాల గ్రామంలో పార్వతి సమేత భక్తంజనేయ, నారాయణగూడెం గ్రామంలో కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ భక్త ఆంజనేయ ఆలయాలు భక్తుల రాకతో కిటకిటలాడాయి. నాగులపహడ్ శ్రీశ్రీశ్రీ త్రికూటేశ్వర ఆలయం పురాతన ఆలయం కావడం, కోరిన కోర్కెలు వెంటనే తీర్చే పేరు ఉండడంతో ఎన్నడూ లేని విధంగా పక్క జిల్లాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో దర్శనానికి అధిక సమయం పట్టింది. కాగా నాగులపహాడ్ ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శనానికి వచ్చిన ముఖ్యులను, ప్రముఖులను ఉత్సవ కమిటీ చైర్మెన్ సంకరమద్ది నిరంజన్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు కొండ జానకిరములు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు సన్మానించారు. రాత్రి అన్ని ఆలయాల్లో శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. నేడు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిటీలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాయిలి లక్ష్మిశ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షడు దొంగరి యుగంధర్, నారాయణగూడెం కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు నారాయణ ప్రవీణ్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు సంకరమద్ది శ్రవణ్ రెడ్డి, ఎదుల్ల శివకృష్ణరెడ్డి, బాణాల విజరు, ఓగ్గు సతీష్, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా మండల పరిధిలోని నాగులపహడ్ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ త్రికూటేశ్వర ఆలయంలో కాంగ్రెస్ పార్టీ నారాయణగూడెం గ్రామశాఖ అధ్యక్షుడు నారాయణ ప్రవీణ్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు సంకరమద్ది శ్రవణ్‌రెడ్డి మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మెన్ సంకరమద్ది నిరంజన్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు కొండ జానకిరాములు ప్రవీణ్‌రెడ్డి, శ్రవణ్ రెడ్డిలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి శ్రీనివాస్, ఉత్సవ కమిటీ సభ్యులు ఎపూరి నగేష్, మచ్చ భక్కయ్య, ఒగ్గు సతీష్, పోగుల జాను, గాజుల శ్రవణ్, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు మాండ్ర మల్లయ్య, బాణాల విజయ్ కుమార్, ఎదుళ్ళ శివకృష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.