Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్‌పహాడ్
మండల పరిధిలోని నారాయణగూడెం గ్రామంలో ఫ్లెక్సీల పంచాయతీకి శనివారం తెరలేసింది. శివరాత్రి సందర్భంగా గ్రామంలో సర్పంచ్, పాలకవర్గం, గ్రామంలోని కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ సమేత భక్త ఆంజనేయ ఆలయ కమిటీలు రెండు ఫ్లెక్సీలు వేశారు. అందులో అధికారికంగా పాలకవర్గం, ఆలయ కమిటీ ఫ్లెక్సీలు వేసి అందులో నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఫోటోలు వేయకపోవడంతో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారాయణ ప్రవీణ్‌రెడ్డి అధికారికంగా ఫ్లెక్సీలు వేసి అందులో ఎంపీ ఫోటోలు లేకుండా ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఎంపీ ఫోటో లేకుండా పాలకవర్గం పేరున ఫోటోలు వేయడం కాక పదవులలో లేని బీఆర్ఎస్ నాయకుల ఫోటోలు గ్రామానికి సంబంధం లేని వారి ఫోటోలు వేశారని పాలక వర్గం పేరున అలా ఎలా వేస్తారని ఆరోపించారు. దేవాలయానికి అందరూ కలిసి చందాలు ఇస్తేనే ఆలయం పుర్తయ్యిందన్నారు. అలాంటప్పుడు పార్టీలకు సంబంధం లేకుండా పదవులు ఉన్న వారి ఫొటోలు మాత్రమే పెట్టాలన్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రవీణ్ రెడ్డి తెలిపారు.