Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి
నవతెలంగాణ-చిలుకూరు
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కొండాపురం గ్రామంలో కనకదుర్గమ్మ జాతర సందర్భంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనకదుర్గమ్మ కృపతో గ్రామంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన రాబోవు తరాలకు భారీ నష్టం జరుగుతుందన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ మతాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నెమ్మది వెంకటేశ్వర్లు, మేదరమెట్ల వెంకటేశ్వర్లు, వేనేపల్లి వెంకటేశ్వరరావు, మిట్టగనపుల ముత్యాలు, నారసాని వెంకటేశ్వర్లు, నాగాటి చిన రాములు, పిల్లి వీర మల్లు, ఎగ్గడి లింగయ్య, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.