Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ఈనెల 22న సీపీఐ( ఎంఎల్ ) ప్రజాపంథా మొదటి ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ప్రజా పంథా సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక కోరారు.శనివారం జిల్లాకేంద్రంలోని విక్రమ్భవన్లో కరపత్రాన్ని ఆమె విడుదల చేసి మాట్లాడారు.అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాడాలంటే జనత ప్రజాస్వామిక విప్లవ అవసరమని, ఆ దారిలో పయనిం చాలన్నారు. ప్రజాపంథా సరికొత్త విధానంతో 2022 ఫిబ్రవరి 22న ఆవిర్భవిం చిందన్నారు.ప్రజలకు గత సిద్ధాంతాలతో అందుబాటులో లేకుండా వివిధ పేర్లతో ప్రజలను మోసం చేస్తూ కాల గమనంలో కానరాకుండా పోతున్న వివిధ విప్లవపార్టీల దారిలో పోకుండా నూతన విధానాన్ని ఆలోచించి నూతనత్వం తోటి అనునిత్యం ప్రజల్లో ఉంటున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి రామోజీ, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి, ప్రజాపంథా పట్టణ కార్యదర్శి గులాం, నాయకులు జీవన్,వాజిద్, సైదులు,సతీష్ పాల్గొన్నారు.