Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవూర
మండలంలోని చింతపల్లి గ్రామంలో దున్న ఇద్దాదాసు ఆరాదనోత్సవాల సందర్భంగా న్యూకిడ్స్ ఉన్నత పాఠశాల అబ్బాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మెన్ ఎస్కే. అబ్బాస్ ఆధ్వర్యంలోగత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి కబడ్డి పోటీలు శనివారం అట్టహాసంగా ముగిశాయి. ముగింపు వేడుకలకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కట్టబోయిన గురువయ్యయాదవ్, అల్లుఅర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్రెడ్డి హాజరై క్రీడలను వీక్షించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని మాట్లాడారు. ఈ పోటీలకు జాతీయ స్థాయిలో 18 రాష్ట్రాలకు చెందిన జట్లు పాల్గొనేలా చేయడం అబ్బాస్ ప్రతిభకు నిదర్శనం అన్నారు. లీగ్ అండ్ నాకౌట్ పద్దతిలో జరిగే ఈ పోటీలకు దేశం నుంచి అనేక మంది జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను పరిచయం చేసిన ఘనత అబ్బాస్కే దక్కుతుందన్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఇంత కన్నుల పండుగగా విజయవంతం అవ్వడం సంతోషమని తెలిపారు. ప్రధమ బహుమతి సౌత్ సెంట్రల్ రైల్వే రూ.1,00,000, రెండవ బహుమతి అబ్బాస్ ఎడ్యుకేషన్ సొసైటీ హర్యానా 80,000, మూడవ బహుమతి న్యూ డిల్లీ 60,000, నాలుగవ బహుమతి తమిళనాడు 50000, ఐదవ బహుమతి వెస్ట్ బెంగాల్, 40,000, ఆరవ బహుమతి కర్ణాటక 30,000లు, ఏడవ బహుమతి తెలంగాణ 25,000లు, ఎనిమిదవ బహుమతి ఉత్తరాఖండ్ 20,000 లు, తొమ్మిదవ బహుమతి ఏపీ మిషన్ 15,000 లు, పదవ బహుమతి అమర్ జ్యోతి హర్యాన 10,000 లు ప్రైజ్ మని, షీల్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కర్తయ్య, గౌరవ అధ్యక్షులు గార్లపాటి శేఖర్, సర్పంచ్ సుంకిరెడ్డి ప్రభావతి సంజీవ రెడ్డి, ఎంపీటీసీ జ్యోతిక్రిష్ణ, ఉప సర్పంచ్ భారతి కొండలు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సుంకిరెడ్డి నారాయణరెడ్డి, గాలి సైదిరెడ్డి, నడ్డి లింగయ్య, సీనియర్ క్రీడాకారులు పల్లెబోయిన సత్యనారాయణ, చిలుకూరు వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.