Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన సీఐ శివరాంరెడ్డి
నవతెలంగాణ-చిట్యాలటౌన్
చిట్యాల పట్టణానికి సమీపంలో గల కొణతం సత్తిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో యాజమానికి తెలియకుండా పేకాట ఆడుతున్న వ్యక్తులను చిట్యాల పోలీసులు, టాస్క్ ఫోర్సు బృందంతో కలిసి అరెస్టు చేశారు. 12 మంది జూదరులను అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ. 3,37,000 ల నగదు 12 సెల్ ఫోన్లు, మూడు కార్లు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు చిట్యాల సీఐ శివరాంరెడ్డి తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెళ్లడించారు. పట్టుబడిన వారందరూ హైదరాబాద్, నల్లగొండ జిల్లాలోని వేరువేరు మండలాలకు చెందిన వ్యక్తులుగా ఉన్నారు. జిల్లాలోని వేరువేరు ప్రాంతాల్లో పేకాట ఆడుతూ తరచూ వారి స్థావరాలు మార్చుతుంటారని తెలిపారు. ఏ వన్ నిందితుడైన గుంటి కిరణ్ నాయకుడిగా ఉండి అందరికీ ముందుగా పేకాట ఆడే సమయం తేదీ, స్థలం నిర్ణయించి తెలియపరచగా మిగతా వారందరూ అక్కడికి వచ్చి పేకాట ఆడుతుంటారన్నారు. పగిళ్ల రమేష్, అయితగోని భుజంగంగౌడ్, షేక్ మహబూబ్ సుభాని భాష, షేక్ ఉమర్ అలీ, తాడిచెట్టు రాఘవేందర్, గుడిపాటి శ్రీనివాస్, గంజి రవికుమార్, జిన్నే అనంతరెడ్డి, ఇమ్మడి కిరణ్ కుమార్, కామాద్రి సంతోష్, పంగ గోపి, కోలా రాము పట్టుబడిన వారిలో ఉన్నారు. పట్టుబడిన వారిలో కొందరిపై గతంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో, హైదరాబాద్లోని పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్సై ధర్మ, ఏఎస్ఐ నాగిరెడ్డి పాల్గొన్నారు.