Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
కేసీఆర్ హయాంలో పురాతన దేవాలయాలకు మహర్దశ కలిగిందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శనివారం పట్టణంలోని ఛాయా, పచ్చల సోమేశ్వరాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అలాంటి దేవ దేవుని సన్నిధిలో భక్తి ప్రపత్తులతో నిష్ట నియమాలతో అత్యంత వైభవంగా మహాశివరాత్రి జరుపు కుంటున్నామన్నారు. మొదటిసారిగా నల్గొండ పట్టణ పురవీధుల్లో పచ్చల, ఛాయా సోమేశ్వర నగరోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న ఈ నల్లగొండ నియోజకవర్గంలో దేవాలయాలకు మహర్దశ వచ్చిందని, 10 కోట్ల రూపాయల ఖర్చుతో ఛాయా సోమేశ్వరాలయాన్ని అభివద్ధి పరుస్తున్నట్టు తెలిపారు. భక్తులకు,మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్, ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మెన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, కౌన్సిలర్లు.ఆలకుంట మోహన్ బాబు, మాతంగి సత్యనారాయణ, ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, గోగుల శ్రీనివాస్ యాదవ్, మారగోని గణేష్, ఊట్కూరు వెంకట్ రెడ్డి, పబ్బు సందీప్, దేవాలయ కమిటీ చైర్మెన్లు, గంట్ల అనంతరెడ్డి, సూర మహేష్, ప్రణాళికా సంఘ సభ్యులు రావుల శ్రీనివాసరెడ్డి, హెరిటేజ్ కమిటీ సభ్యులు జలంధర్ రెడ్డి, పెరిక యాదయ్య, కొడదల లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.