Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దేవరకొండ నియోజకవర్గంలోని ఇద్దరికీ రూ. 98 వేలు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన చెక్కులను బాధితులకు అందజేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సీఎం సహాయనిధి కింద చికిత్స కోసం ఆర్థిక సాయం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మారుపాకుల అరుణ సురేష్ గౌడ్, టీవీఎన్ రెడ్డి, మునుకుంట్ల వెంకటరెడ్డి, ఒడ్డుపల్లి కష్ణ, బాలు, ఇలియాస్ పటేల్, అంజయ్య ,ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
గ్రామపంచాయతీ భవనాలకు నిధులు మంజూరు
దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని 25 గిరిజన తండాల గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. శనివారం దేవరకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామపంచాయతీ నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపగా గిరిజన తండాల గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణానికి రూ . 5 కోట్లు మంజూరు చేస్తూ జీవో నెంబర్ 32 ద్వారా గిరిజన సంక్షేమ శాఖ నుంచి నిధులు మంజూరు అయ్యాయన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ భవనానికి రూ. 20 లక్షల చొప్పున మంజూరైనట్లు తెలిపారు. తండాల గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.