Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఆకాంక్షించారు. శనివారం మహా శివరాత్రి పురస్కరించుకొని అనంతగిరి మండలం గొండ్రియాల గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజాలు నిర్వహించి ఆయన మాట్లాడారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో శివరాత్రి పండుగను జరుపుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి లీలావతి వెంకటేశ్వర్లు, ఆలయ చైర్మెన్ గంగూరు శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు మాగి యాకోబు, తుమ్మలపల్లి భాస్కర్, ప్రసాద్‌రెడ్డి, శ్రవణ్, ఒంటిపులి శ్రీనివాస్, ఖదీర్, నవీన్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.