Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరురూరల్
ప్రతి ఒక్కరూ దైవచింతన కలిగిం ఉండాలని బీఆర్ఎస్ జిల్లా నాయకురాలు సోలిపురం అరుణ ఉపేందర్‌రెడ్డి అన్నారు.శనివారం మండలంలోని కొలనుపాక గ్రామంలోని మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రసిద్ధ సోమేశ్వర ఆలయాన్ని కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కసగలఅనసూయ, గడ్డంఅనిత,బొంకూరి భాగ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా మండలంలోని శర్భనాపురం గ్రామంలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో కొండల్‌రెడ్డి ఉమామహేశ్వరి దంపతులు ప్రత్యేకపూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కొమిరెడ్డి నర్సింహారెడ్డి దంపతులు, రాగి నర్సింహారెడ్డి,సీపీఐ(ఎం)మండల కార్యవర్గ సభ్యులు సుధగాని సత్తరాజయ్య, భక్తులు చంద్రకళ, సత్యలక్ష్మీ, వాణి, లక్ష్మీ, మణెమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : మండలకేంద్రంలో మహా శివరాత్రి పర్వదినం వేడుకలు పురస్కరించుకొని భక్తులు భక్తిశ్రద్ధల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయం నుండే శివరాత్రి ఉపవాసాలు ఆహారం తీసుకోకుండా నిష్ఠతో నిర్వహించారు. సాయంత్రం శివాలయం శ్రీ రంగనాయక ఆలయం సంతోషిమాత శివాలయం లో అభిషేకం కుంకుమార్చన నిర్వహించారు.మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య,టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశం, కౌన్సిలర్ బేతే రాములు, బీఆర్ఎస్ నాయకులు దయాల సంపత్, సిద్ధేశ్వరాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పట్టణంలోని భక్తులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లి : శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు శివాలయాల్లో ప్రత్యేకపూజలు నిర్వహించారు.మార్కండేశ్వరస్వామి, నల్ల వీరభద్రస్వామి, బసవ లింగేశ్వరస్వామి, బుగ్గ రామలింగేశ్వర స్వామి, మండలపరిధిలోని ఆయా గ్రామాలలో శివాలయాలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు.