Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ-ఆత్మకూర్ఎం
బునాదిగాని కాలువ పనులను ఎప్పటిలోపు పూర్తి చేస్తారో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతమహేందర్రెడ్డి వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ డిమాండ్ చేశారు.మండలకేంద్రశివారులోని బునాదిగాని కాలువను సీపీఐం(ఎం)జిల్లా నాయకత్వం శనివారం సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 98 కిలోమీటర్ల మేర ఉన్న బునాదిగాని కాలువ బీబీనగర్, భువనగిరి, వలిగొండ, మోటకొండూరు, ఆత్మకూరుఎం, మోత్కూర్, అడ్డగూడురు మండలాల్లో ప్రవహిస్తుందన్నారు.కాల్వ పనులు పూర్తయితే ఆయా మండలాల్లోని రైతాంగానికి సాగునీరు అందుతుందన్నారు.మూసీ నీటికి బదులుగా గోదావరి నీటిని బస్వాపురం రిజర్వాయర్ నుండి తీసుకొచ్చి పహీల్వాన్పురం చెరువును మినీ రిజార్వాయర్ చేసి, బునాదిగాని కాలువకు అనుసంధానం చేయాలన్నారు.తద్వారా ప్రజలకు తాగు, సాగు నీరందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బునాదిగాని కాల్వ పనులు ఎప్పటిలోపు పూర్తి చేస్తారో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ సినీయర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి, సంగు నరేందర్,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజుగౌడ్, కల్లూరిమల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేశం, మండల కార్యదర్శి వేములభిక్షం, నాయకులు రచ్చ గోవర్థన్,సత్తయ్య, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.