Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరురూరల్
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు కానీ సీఎం కేసీఆర్ మాత్రం వారి కుటుంబ సభ్యులను ధనికులుగా చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను పేదవారుగా ఉండేటట్టుగా చూసారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీర్ల ఐలయ్య మండిపడ్డారు. ఆదివారం మండలంలోని శర్భనాపురం గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.వైఎస్.రాజశేఖర్‌రెడ్డి నియమించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రజలకు సేవ చేసే విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందని సూచించారు.2023 సంవత్సరంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగవుతుందన్నారు.ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు.ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే కేవలం సంపాదించుకోవడానికి రాజకీయం చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గడ్డమీది నరేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు బుగ్గ నరేష్ ,మాజీ ఉపసర్పంచ్ సైదాపురం శాంతమ్మ ,పార్టీ నాయకులు సిరిగిరి సారయ్య,బోడ నరేష్,వట్టెం నర్సింహులు, కారే రమేష్, వట్టపు శ్రీశైలం, బోడ శ్రీకాంత్, సిరిగిరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.