Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూర్
ఆయిల్ఫామ్ సాగుతో అధిక లాభాలు సాధించవచ్చని, రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మెన్ కంచర్ల రామకృష్ణారెడ్డి కోరారు.మోత్కూరు మండలం అనాజిపురం గ్రామంలో రైతు పంజాల రామకృష్ణ వ్యవసాయక్షేత్రంలో ఆదివారం ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంటనూనెల ఉత్పత్తిలో ఆయిల్ఫామ్ ఎంతో డిమాండ్ ఉన్న పంట అన్నారు. తక్కువ పెట్టుబడితో సాగు చేయవచ్చని, మొక్కలు ఒక్కసారి నాటితే మూడేండ్ల తర్వాత 30 ఏండ్ల పాటు పంట దిగుబడి వస్తుందన్నారు.ప్రభుత్వం కూడా పలు రకాల సబ్సిడీలు ఇస్తూ ప్రోత్సహిస్తుందని తెలిపారు. రైతులు మూస పద్ధతిలో సాగు చేసే పంటలకు స్వస్తి పలికి ప్రత్యామ్నాయ లాభాలు వచ్చే ఆయిల్ఫామ్ సాగు చేయాలని కోరారు.ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి వచ్చిన రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గోరుపల్లి శారదసంతోష్‌రెడ్డి, సర్పంచ్ ఉప్పల లక్ష్మీయాదయ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండా సోంమల్లు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు గోరుపల్లి సంతోష్‌రెడ్డి, మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేష్, రైతుబంధు గ్రామ కోఆర్డినేటర్ నిమ్మల సత్యనారాయణ, గ్రామశాఖ అధ్యక్షుడు వల్లందాసు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.