Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వలిగొండరూరల్
పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం చావ పౌండేషన్ వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి ఆన్నారు.ఆదివారం మండలంలోని దాసిరెడ్డిగూడెంలో చావా ఫౌండేషన్, రోటరీ క్లబ్ వారు సంయుక్తంగా భువనగిరి ఆర్కే ఆస్పత్రి వారి సౌజన్యంతో నిర్వహించిన పల్లె పల్లెకు వైద్యం అనే ఉద్దేశంతో ఉచిత వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు.అవసరమున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంతాలలో ఉన్నతమైన ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొమిరెల్లి సరితా సంజీవరెడ్డి, ఎంపీటీసీ నోముల మల్లేశం, పీఏసీఎస్ చైర్మెన్ సుర్కంటి వెంకట్‌రెడ్డి, తుమ్మలవెంకట్రెడ్డి, మొగుళ్ల శ్రీనివాస్, బండారు శ్రీనివాస్‌రావు, పలుసం రమేష్, గుండు శేఖర్‌రెడ్డి,బెళ్లి నర్సింహ,వైద్యులు రాజ్‌కుమార్, ఆశ్లేష తదితరులు పాల్గొన్నారు.