Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
బడుగు,బలహీనవర్గాల అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా బీర్ల ఫౌండేషన్ పనిచేస్తుందని బీర్ల ఫౌండేషన్ చైర్మెన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య అన్నారు.మండలంలోని బుర్జుబావి గ్రామంలో బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాటర్ఫిల్టర్ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజాసేవే లక్ష్యంగా బీర్ల ఫౌండేషన్ ఆలేరు నియోజకవర్గంలో ఇప్పటికే 170 గ్రామాల్లో వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేసి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామన్నారు.కరోనా కష్టసమయంలో ప్రతి గ్రామంలో గడప గడపకు నిత్యావసర సరుకుల పంపిణీ,నియోజకవర్గంలో ప్రత్యేకంగా నాలుగు అంబులెన్స్‌ల ఏర్పాటుచేసి సేవల ందించామన్నారు.ఎన్నికల హామీల అమలులో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు.రానున్న రోజుల్లో కాంగ్రెస్‌కు మీ ఆశీస్సులు అందిస్తే పార్టీలకతీతంగా ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందా మన్నారు.అనంతరం గ్రామంలోని ప్రతి కుటుంబానికి వాటర్క్యాన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.వాటర్ ప్లాంట్ దాత బీర్ల ఫౌండేషన్ చైర్మెన్ బీర్ల అయిలయ్యకు గ్రామస్తులు ఘన స్వాగతంతో పాటు పూలమాలలు, శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్ర మంలో పీఏసీఎస్ చైర్మెన్ లింగాల భిక్షంగౌడ్, ఫౌండేషన్ వైస్‌చైర్మెన్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసరుపు యాదగిరిగౌడ్,మాజీ జెడ్పీటీసీ కోలుకొండ యాదగిరి,సర్పంచ్ ఏలూరి రాంరెడ్డి,ఎంపీటీసీలు సంగి అలివేలు వెంకటాద్రి,కొర్న నరేష్,కేమిడి అనిత రవికుమార్,ఎస్సీసెల్ మండల అధ్యక్షులు కుమ్మరికుంట్ల రాజారత్నం,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నగాని నారాయణ,తోటకూర రాజు,గ్రామ శాఖ అధ్యక్షుడు చెట్లపల్లి అంజయ్య,వార్డుసభ్యులు నాగయ్య,మహేష్,నాయకులు వల్లపు రాజు,మధు రాజగొల్ల,బాలరాజు,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.