Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
నేటి సమాజంలో విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి కే.నారాయణరెడ్డి, ఆలేర్ జూనియర్ సివిల్ జడ్జి సూర సుమలత అన్నారు. మండల కేంద్రంలో శ్రీ రామకష్ణ విద్యాలయం ఆవరణలో శ్రీ రామకృష్ణ పరమహంస జయంతి పురస్కరించుకొని 39 వ వార్షికోత్సవ వేడుకలు పాఠశాల ప్రధానా చార్యులు బండిరాజుల శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. హైదరాబాద్ రామకృష్ణ మఠం సత్య చైతన్య మహారాజ్తో కలిసి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఏకాగ్రత, పట్టుదలతో విద్యపై పట్టు సాధించా లన్నారు.రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానంద- ఈ మూర్తి త్రయం జీవితాలను చదివితే మనకు కావాల్సిన విద్య అందుతుందన్నారు. బుద్ధిజీవి అయిన మానవుడు విద్యార్థి దశ నుండే చదువుతో పాటు సంస్కారాన్ని అల వరచుకోవాలని పేర్కొన్నారు.విద్యార్థిని విద్యార్థులకు విద్యానందిస్తూ అత్యున్నత పౌరులుగా తీర్చిదిద్దుతున్న శ్రీ రామకృష్ణ విద్యాలయం విద్యాలయ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశంను పాఠశాల యాజమాన్యం ఘనంగా శాలువా,మెమోంటోతో సత్కరించారు. విద్యా ర్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహ్వానితులను అలరించారు.ఈ కార్యక్రమంలో ఆలేరు పురపాలక సంఘంచైర్మెన్ వస్పరి శంకరయ్య, డా.పోరెడ్డి రంగయ్య,దూడల వెంకటేశ్, గుండు జగన్మోహన్, పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.