Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండింగ్లో మూడునాలుగు నెలల వేతనాలు
- అప్పుల పాలవుతున్న కార్మికులు
- మురికి కూపంలో పనితో రోగాల మాయం
నవతెలంగాణ-భూధాన్పోచంపల్లి
పారిశుధ్య కార్మికులు గ్రామాలలో వార్డులు శుభ్రం చేస్తూ మోరీలు శుభ్రం చేస్తూ గ్రామాన్ని సుందరగా తీర్చిదిద్దడంలో పారిశుద్ధ్య కార్మికులు ఎనలేని కషి చేస్తున్నప్పటికీ వారి మీద ప్రభుత్వాలు కక్షపూరితంగా వ్యవహరిస్తుంది.వంశం పరంపర్యంగా ఆ పనులే చేసుకుని బతికేలా సమాజం విరిగిసి వారినందులో బంధింప చేసి ఆ పని చేస్తున్నారన్న కనీస సానుభూతి చూపే వారి కన్నా చీచీఅంటూ ఈసడించుకుంటూ ముక్కు మూసుకొని పోయేవారు ఎక్కువ.సామాజికంగా ఇటు పనిపరంగానూ వివక్ష ఎదుర్కొంటూ ఎవ్వరూ చేయలేని పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు రాష్ట్ర సర్కారీ ఇస్తున్న అక్షరాల రూపాయలు 8500 మాత్రమే.దానికి పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నది.ఆ జీతం అందుతుందా అంటే అది కూడా లేదు. నాలుగైదు నెలలకు ఒకసారి తీసుకునే పరిస్థితి కార్మికులు ఏ పంచాయతీ కార్మికుల్ని కదిలించిన ఒక్కొక్కరిది ఒక్కో గాధ అయినా తమ సమస్యలు చెప్పుకోవడానికి భయపడుతున్న పరిస్థితి.మల్టీపర్పస్ బాండ్ పేపర్ రాయించుకోవడమే తాము చెప్పినట్లు ఉంటేనే పనిలో కొనసాగిస్తాం..లేకుంటే తీసేస్తామని బెదిరింపు ధోరణి క్షేత్రస్థాయిలో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.దీంతో సర్పంచులకు భయపడి వారి వ్యవసాయ పనులు.ఇంటి పనులు కూడా చేస్తున్నారు.ఎలక్ట్రిషీయన్లు, వాటర్మెన్లు నిరంతరం వీధుల్లో ఉండాలి.వారి రక్షణ కోసం సర్కారీ ఏ ఒక్కటి చేయడం లేదు.ఉదయం 6 గంటల నుంచి పనుల్లో ప్రారంభమై 10 గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఎవ్వరు చేయలేని పని చేస్తున్న వారికి కనీసం ఈఎస్ఐ,పీఎఫ్ వంటి సౌకర్యాలు కూడా లేవు.రోగం వచ్చిన నొప్పి వచ్చిన సొంత పైసలు పెట్టుకొని చూయించుకోవాల్సిందే.కారోబార్,బిల్కలెక్టర్ సైతం చాలా అవమాన భారంతో పనిచేస్తున్నారు.వారే బిల్లులు వసూళ్లు లైట్లు వేస్తున్నారు.కొన్ని చోట్ల అయితే మూలాల్లో మట్టి కూడా తీస్తున్న పరిస్థితి ఉంది.కొన్ని చోట్ల నాలుగైదు పనులు చెప్పి టార్గెట్లు పూర్తి చేయలేదని వేధిస్తున్న పరిస్థితి.గ్రామపంచాయతీ పనిచేస్తున్న సిబ్బంది అత్యధికులు దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు చెందిన పేదలు పాలకులు మారినా వీరి బతుకులు మాత్రం మారడం లేదు.76 ఏండ్లు స్వాతంత్య్రంలో నిర్లక్ష్యం నిరాదరణకు గురైన వారు గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులే గ్రామ పంచాయతీ ఉద్యోగులు.కార్మికులందర్ని పర్మినెంట్ చేసి కనీస వేతనం నిర్ణయించాలని, సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్న చట్టాలను ప్రభుత్వాలు కాలరాస్తున్న పరిస్థితి కేంద్రం బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్కోడ్లను రద్దు చేయాలని కోరుతున్నా కనీసవేతనం నెలకు రూ.26 వేలుగా నిర్ణయించాలని, ఆలోపు మున్సిపల్ కార్మికులకు ఇస్తున్నట్టుగా గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచి జీవో నెంబర్ 60 ప్రకారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కారోబార్ బిల్లు కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.శాస్త్రీయమైన విధానం 500 మంది జనాభాకు ఒక్క కార్మికుడు చొప్పున లెక్కించిన వేతనాన్ని రూపాయలు 8500 గా నిర్ణయించింది అదునంగా ఉన్న కార్మికులకు ఎలాంటి వేతనాలు చెల్లించడం లేదు ఒక కార్మికునికి ఇచ్చే వేతనాన్ని అక్కడ పనిచేసే కార్మికులందరూ పంచుకుంటున్నారు.ఫలితంగా రూపాయలు 3500 నుండి 4500 మాత్రమే వేతనాలు పొందుతున్నారు.ఈ విధానం కొండనాలికకు మందు వేస్తే ఉన్న నాలిక ఓడినట్లు ఉంది.ఉద్యోగ భద్రత కల్పించే పర్మినెంట్ చేసి కనీస వేతనాలు పెంచాలని గ్రామపంచాయతీ సిబ్బంది ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నామమాత్రంగా వేతనాలు పెంచి గ్రామపంచాయతీ సిబ్బంది మెడకు ఉరితాడు బిగించారు. వివిధ కేటగిరిలను రద్దు చేసి మల్టీపర్పస్ విధానాన్ని తీసుకొచ్చారు.కలం పట్టిన కారోబారు,బిల్కలెక్టర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు.జీవో నెంబర్ 51కు ముందు గ్రామంలో గౌరవప్రదంగా జీవించిన కారోబార్ మల్టీ పర్పస్ వర్కర్ విధానం సాకుతో పారిశుధ్యం వీధి దీపాల నిర్వహణ, టాక్టర్ నడపడం, చివరకు ప్రజాప్రతినిధుల ఇండ్లలో వ్యక్తిగత పనులు చేస్తున్నారు
నేడు జరిగే పాదయాత్రను జయప్రదం చేయండి
సీఐటీయూ మండల కార్యదర్శి-మంచాల మధు
గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు రోజుల నుండి కొనసాగుతున్న పాదయాత్రలో ఉద్యోగ కార్మికులందరూ పాల్గొనాలి. పాదయాత్రకు వివిధ ఉద్యోగ కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు మద్దతునివ్వాలి.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి.పారిశుధ్య కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26 వేలుగా నిర్ణయించాలి.జీవో నెంబర్ 60 ప్రకారం కార్మికులకు నెలకు రూ.15600, కారోబార్, బిల్కలెక్టర్లకు రూ.19500, కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.22,750 చొప్పున వేతనాలు చెల్లించాలి.కారోబార్, బిల్కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలి.మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి.పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి.పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాదబీమా సౌకర్యం అమలు చేయాలి.