Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
కార్మికుల సమస్యలపై నేడు కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు షేక్ యాకూబ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై నేడు సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయాలన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లుగా తెచ్చి గ్రామపంచాయతీ సిబ్బందికి కార్మిక చట్టాలు వర్తించకుండా కుట్రలు చేస్తుందని తెలిపారు. ఎంతోకాలంగా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కార్మిక సంఘాలు పోరాడుతుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం రోజుకు 175 రూపాయలు ఇస్తూ కొన్ని గ్రామపంచాయతీలో 4,628 రూపాయలు ఇస్తున్నారని, లేబర్ కోడ్ల మూలాన పంచాయతీ కార్మికులకి పీఎఫ్, ఈఎస్ఐ తదితర సంక్షేమాలు కార్మికులకు నోచుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. గ్రామపంచాయతీ సిబ్బందిలో అత్యధికులు దళితులు, గిరిజనులు వెనకబడిన వర్గాలకు చెందిన వారు ఉండటం వనల వీరి సమస్యలని పరిష్కరించే నాధుడు లేకపోయాడని చెప్పారు. ఈ సమావేశంలో నాగరాజు, వెంకన్న, సైదులు, బంటు సైదులు, నాగాచారి, వెంకటరత్నం, రాజు, తదితరులు పాల్గొన్నారు.