Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
నాన్న అనే పదం ఒక బలమైన నమ్మకం అని, ఆ నమ్మకమే తనను జీవితంలో ఉన్నతంగా నిలబెట్టిందని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.తన తండ్రి రిటైర్డ్ మున్సిపల్ ఆర్ఐ అనుములపూరి నర్సయ్య జ్ఞాపకార్థం పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో అపోలో డయాగస్టిక్ సెంటర్ సహకారంతో ఆదివారం స్థానిక అంతటి విజరు ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన షుగర్ కొలెస్ట్రాల్ ఉచిత వైద్య పరీక్షలను ఆమె ప్రారంభించి మాట్లాడారు.నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని చెప్పారు.నలుగురు ఆడపిల్లలమైనప్పటికీ మగపిల్లల్లా పెంచారని గుర్తు చేసుకున్నారు.చిన్ననాటి నుంచే సమాజంపై అవగాహన కల్పించి తాము జీవితంలో ఉన్నతంగా నిలబడేలా తీర్చిదిద్దిన నాన్న రుణం తీర్చుకోలేనిదని కొనియాడారు.తనకు చైర్పర్సన్ పదవి ఇచ్చిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సహకారంతో నాన్న అందించిన స్ఫూర్తితో బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తిస్తున్నానని తెలిపారు.తనది పేదల వార్డు కావడంతో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను ప్రజలు నిర్లక్ష్యం చేస్తారని, ఈ పరీక్షలతో పేద ప్రజలకు ఎంతో మేలు చేసిన వారయ్యారన్నారు.ఆరోగ్యమే మహాభాగ్యమని ,ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతామని ప్రతిఒక్కరూ ఆరోగ్య పరీక్షలను చేయించుకుని సరైన వైద్యం తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు అప్పం శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మెన్ పెండెం చంద్రశేఖర్, లయన్స్ క్లబ్ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ రమేష్‌చంద్ర, పద్మశాలి సంఘం యువజన అధ్యక్షులు మిట్టకోల యుగంధర్, బీఆర్ఎస్ నాయకులు కడారి సతీష్‌యాదవ్, బోల్లెద్దు దశరథ, బొలిశెట్టిమధు, పద్మశాలి సంఘం నాయకులు దూలం నగేష్, రేణుబాబు, పున్నవెంకన్న, జగదీష్, కొంగరి ఉపేందర్, అపోలో డయాగస్టిక్స్ సెంటర్ నిర్వాహకులు రాపోలు సంతోష్, గంజి రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.