Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
- పార్టీలో చేరిన కాంగ్రెస్ కౌన్సిలర్ విక్రమ్
నవతెలంగాణ-సూర్యాపేట
పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్, బీజేపీలకు చెందిన వారు బీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 34 వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ మడిపల్లి విక్రమ్‌తో పాటు ఆత్మకూరు (ఎస్) మండలానికి చెందిన కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని మోడీ 9 ఏండ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లోనూ వెనకబడిందన్నారు.దేశవ్యాప్తంగా బీఆర్ఎస్కు ఆదరణ పెరుగుతుందన్నారు.మోడీ సొంతరాష్ట్రం గుజరాత్లో కూడా తెలంగాణలో మాదిరిగా నిరంతరం విద్యుత్ సరఫరా లేదని ఆరోపించారు.గత పాలకుల హయాంలో సూర్యాపేటలో మంచినీళ్ల కోసం మహిళలు కొట్లాడిన రోజు నుండి నేడు బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఇంటింటికీ మంచినీటి సరఫరా చేస్తున్నామని వివరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయాల చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్,జెడ్పీ వైస్‌చైర్మెన్ గోపగాని వెంకట నారాయణగౌడ్, మున్సిపల్ వైస్‌చైర్మెన్ పుట్ట కిషోర్, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.