Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
నవతెలంగాణ-కోదాడరూరల్
ఈద్గా ప్రహరీ పూర్తయ్యే వరకు తనే బాధ్యత వహిస్తానని, మౌలిక సదుపాయాలు కూడా కల్పించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం పట్టణ పరిధిలోని సాలార్జంగ్పేటలో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టిన ఈద్గా ఆధునీకరణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి మాట్లాడారు. మైనార్టీల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల అమలు చేస్తూ కృషి చేస్తుందన్నారు. పూర్వ కాలం నుండి ఎంతో చరిత్ర కలిగిన ఉన్న మసీదులు శిథిలావస్థకు చేరుకున్న దశలో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షలాది రూపాయలు మంజూరు చేసి వాటిని భవిష్యత్ తరాలకు పదిలంగా వుంచిందన్నారు.ఈద్గాలు ముస్లిం లకు పవిత్ర స్థలాలు గా గుర్తించి వాటి అభివృద్ధి కి కృషి చేస్తున్నామన్నారు. మోడీ ప్రభుత్వం దేశానికీ స్వాతంత్య్ర తేలేదని,స్వాతంత్య్ర పోరాటంలో ముస్లింల పాత్ర కీలకంగా ఉందన్నారు.గత పాలకులు ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్పా వారి అభివృద్ధికి చేసింది ఏమి లేదన్నారు. గత కొన్ని ఏళ్ళుగా ఈద్గా కు వస్తున్నానని ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న విషయం చూసి ఈద్గా అభివృద్ధికి నిధులు కేటాయించాన్నారు. పలువురు ముస్లింలు మాట్లాడుతూ బొల్లం మల్లయ్యయాదవ్ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు వచ్చే విధంగా కృషి చేస్తున్నారన్నారు. తన ఎమ్మెల్యే కోటా నుండి 20 లక్షల రూపాయలు మంజూరు చేసిన ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌ను కోదాడ ముస్లింలు సన్మానించారు. సాలార్జంగ్ పేట ముఖద్వారం నుండి భారీ ఎత్తున ఎమ్మెల్యేకు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. స్థానిక కౌన్సిలర్ షేక్ మదార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద మసీదు గురువు అబ్దుల్ ఖాదర్, సదర్ మహ్మద్, ముఫ్తీ అహ్మద్,మాజీ కో ఆప్షన్ అల్తాఫ్ హుస్సేన్, మసీద్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్, మాజీ కౌన్సిలర్ నయీం, మైనార్టీ నాయకులు బషు మియా, అయుబ్ మౌలానా, కౌన్సిలర్స్ షేక్ మదార్, షఫీ, కదిర్, ఫాతిమా కాజా, కందుల చంద్రశేఖర్, షాబుద్దిన్, కోఆప్షన్ సభ్యులు సాదిక్, గ్రంధాలయ చైర్మెన్ రహీం, ఉపాధ్యక్షులు నైజాం, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు, నాయకులు వెంపటి మధు, బెజవాడ శ్రవణ్,వొంటిపులి శ్రీను, సంపేట ఉంపేందర్, బీఆర్ఎస్ నాయకులు, ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.