Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ రాధారాణి
నవతెలంగాణ-హుజూర్నగర్
హుజూర్ నగర్ కోర్టులో మౌలిక వసతుల కల్పనకు, ఖాళీ పోస్టుల భర్తీ చేయటం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సూర్యాపేట జిల్లా పోర్టు పోలియో జడ్జి డాక్టర్ రాధా రాణి అన్నారు. ఆదివారం ఆమె కోర్టును పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ హుజూర్‌నగర్‌కు మంజూరైన జిల్లా అదనపు న్యాయస్థానం ప్రారంభించడానికి స్థానిక బార్ అసోసియేషన్ చేసిన కృషిని ప్రత్యేకంగా అభినందించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఈ విషయాన్ని విన్నవించి నూతన కోర్టు ప్రారంభోత్సవ తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రామిరెడ్డి మాట్లాడుతూ కోర్టులో ఉన్న సమస్యలను హైకోర్టు న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. మేళ్లచెరువు, చింతలపాలెం మండలాలు హుజూర్‌నగర్‌కు సమీపంలో ఉన్నందున హుజూర్ నగర్ కోర్టు పరిధిలో ఉంచాలన్నారు. ఈ మండలాలు హుజూర్నగర్ కోర్టుకు కేటాయిస్తూ ప్రభుత్వం గతంలో ఇచ్చిన గెజిట్ విడుదల గురించి న్యాయమూర్తికి తెలిపారు. అనంతరం స్థానిక ఖైదీల యోగక్షేమాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌతమ్ ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి శ్యామ్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సామల రామిరెడ్డి, జక్కుల నాగేశ్వరరావు, న్యాయవాదులు కాలువ శ్రీనివాసరావు, అంబటి శ్రీనివాసరెడ్డి, నట్టే సత్యనారాయణ, కుక్కడపు బాలకృష్ణ, మీసాల అంజయ్య, యాదగిరి, ప్రవీణ్ రమణారెడ్డి, కృష్ణయ్య, రేణుకాదేవి, రమాదేవి, ప్రదీప్తి, దీపిక, ఏజీపీ గోపాలకృష్ణమూర్తి, ఆర్డీవో వెంక రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి సీఐ రామలింగారెడ్డి, ఎస్సై వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
కోర్టులో సమస్యలను పరిష్కరించేందుకు కృషి
కోదాడరూరల్ :స్థానిక కోర్టులో సమస్యల పరిష్కారానికి, నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయడంతో పాటు అర్హత కలిగిన డిమాండ్లను నెరవేర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హైకోర్టు జడ్జి, జిల్లా పోర్ట్ ఫోలియో జడ్జి రాధారాణి హామీ ఇచ్చారు. పోర్ట్ ఫోలియో జడ్జిగా నియమితులైన సందర్భంగా ఇటీవల కోదాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆమెను కలిసి కోర్టును సందర్శించాలని కోరారు. వారి విజ్ఞప్తి మేరకు ఆమె ఆదివారం కోదాడ కోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా కోర్టు పరిసరాలు, పాత కోర్టు స్థలం, బార్ అసోసియేషన్ రూం, న్యాయమూర్తుల నివాస భవనాలు నిర్మాణానికి కేటాయించిన స్థలాలను పరిశీలించారు. ఈ క్రమంలో న్యాయవాదులు తమ సమస్యలను ఆమెకు వివరించారు. కోర్టు భవనం నిర్మాణానికి నిధులు రాకపోవడంతో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. సబ్ కోర్టు ఏర్పాటు కాక న్యాయవాదులు, కక్షిదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆమెకు వివరించారు. గతంలో మాదిరిగా మెళ్లచేరువు కోర్టు పరిధిని తిరిగి తమ కోర్టు పరిధిలోకి తీసుకు రావాలని కోరారు. నూతన కోర్టు నిర్మాణానికి వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించి జడ్జి మాట్లాడుతూ హై కోర్ట్ పరిధిలో ఉన్న అంశాలను పరిశీలించి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం జడ్జి రాధారాణిను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు, మహిళా న్యాయవాదులు, పలువురు న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపల్ జడ్జి గౌతమ్ ప్రసాద్, కోదాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్యామ్ సుందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవబ త్తిని నాగార్జునరావు, ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్ రహీమ్, ప్రధాన కార్యదర్శి సిలివెరు వెంకటేశ్వర్లు, సీనియర్ న్యాయవాదులు ఎలక సుధాకర్‌రెడ్డి, ఎస్ఆర్కే.మూర్తి, చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, మేకల వెంకట్రావు, పలువురు జూనియర్ న్యాయవాదులు, పోలీసు, అధికారులు, సిబ్బంది, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.