Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేతపల్లి
విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని, కుతూహలాన్ని పెంచేందుకు కషి చేయాలని ఫిజిక్స్ లెక్చరర్ కే.ప్రభాత్ అన్నారు. ఆదివారం మండలంలోని బండపాలెం గ్రామంలో జ్ణానాదర్శ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28 సైన్స్ డేను జయప్రదం చేయాలని క్విజ్ పోటీలు నిర్వహించారు. క్విజ్ పోటీలు సీవీ. రామన్, ఐన్‌స్టీన్, మేరీ క్యూరీ, డార్విన్ టీంల మద్య పోటాపోటీగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రభాత్ మాట్లాడుతూ సైన్స్‌లోని అద్భుతాలు విద్యార్థి దశ నుంచే తెలుసుకోవాలని, అందుకు ఇలాంటి పోటీలు ఉపయోగపడ్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సీహెచ్. నాగయ్య, విక్రం, రవి వర్మ, ఉపేందర్, వీరేశ్, లోకేష్, లిఖిత, భరత్, సాయిచరణ్, వర్షిత్, హర్షిత్ పాల్గొన్నారు.