Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోతె: పెట్రోల్, డీజిల్,గ్యాస్‌లను జీఎస్టీ పరిధిలోకి తేవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు.సోమవారం మండలకేంద్రంలో పార్టీ గ్రామ శాఖ సమావేశాలు పాల్గొని ఆయన మాట్లాడారు.అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోయిన పెట్రోలియం ఉత్పత్తి ధరలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని రకాల వస్తువులపై పన్ను భారం పడిందన్నారు.పేద,మధ్యతరగతి ప్రజలు అధిక ధరలతో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో మండల కమిటీ సభ్యులు జిఎస్ గ్రామ కార్యదర్శి గురజాల నాగయ్య ,దోసపాటి శ్రీను, చర్లపల్లి మల్లయ్య, ఇండ్ల వెంకన్న, వెంకటమ్మ,అనసూర్య, పుష్ప పాల్గొన్నారు.