Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని దిర్శించర్ల గ్రామంలో దిర్శించర్ల వాలీబాల్ యూత్ ఆధ్వర్యంలో ఈనెల 18 19 20 తేదీలలో జరుగుతున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల విజేతలకు సోమవారం బహుమతులు ప్రదానం చేశారు.వాలీబాల్ క్రీడలు మూడు రోజులుగా ప్రశాంత వాతావరణంలో హోరాహోరీగా జరిగాయి. ప్రథమ బహుమతి వరంగల్ జట్టు 25 వేల రూపాయలు నగదుతో పాటు షీల్డ్, గెలుచుకోగా ద్వితీయ బహుమతి వెంకటేశ్ టీం 20 వేల రూపాయల నగదుతో పాటు షీల్డ్, తృతీయ బహుమతి నందిపాటి కిరణ్ టీం 15,116లు నగదుతో పాటు షీల్డ్, చతుర్ధ బహుమతి త్రిపురారం టీం రూ.10 వేల నగదుతో పాటు షీల్డ్ అందుకున్నారు.ఈ సందర్భంగా విజేతలకు వైస్‌ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ బహుమతులు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శించర్ల గ్రామంలో దాదాపు 150 మంది పైగా కానిస్టేబుల్ ఉన్నారని, అది కేవలం క్రీడల వల్లే సాధ్యమైందని క్రీడల వల్ల మనిషి శారీరకధారుడ్యంతో పాటు చురుకైన మెదడు కలిగి ఉంటారన్నారు.తద్వారా మంచి విద్యను అభ్యసించి అధికమార్కులు పొంది మంచి ఫలితాలు రాబట్టవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కర్నె.నాగిరెడ్డి ఎలీషా, కర్ణం పాండయ్య, ఆకుల జగతయ్య, మిడతలపల్లి శ్రీనివాస్, కుంటి గొర్ల లింగయ్య పాల్గొనగా ఎంపైర్లుగా సీతారాంరెడ్డి ముక్కంటి యాదగిరి విజరురెడ్డి వ్యాఖ్యతగా పి.వెంకటేశ్వర్లు వ్యవహరించగా ఈ టోర్నమెంట్లో మొత్తం 44 జట్లు పాల్గొన్నాయి.