Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల పర్యవేక్షణ అధికారి డాక్టర్ కాటం రాజు
- మండలంలో కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమం
నవతెలంగాణ- చౌటుప్పల్ రూరల్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కంటి వెలుగు మండల పర్యవేక్షణ అధికారి డాక్టర్ కాటంరాజు కోరారు. మండలంలోని చిన్న కొండూరు గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో మూడు టీములుగా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 18ఏండ్లు నిండిన వారందరికీ కంటి పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు.చిన్న కొండూరు తోపాటు పంతంగిలో కొనసాగుతుందని తెలిపారు. చిన్న కొండూరు గ్రామంలో సోమవారం 130 మందికి కంటి పరీక్షలు చేసినట్లు పేర్కొన్నారు. కంటి అద్దాలు అవసరమైన వారికి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. చిన్న కొండూరులో మార్చి 3తేదీ వరకు కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు.గ్రామ సర్పంచ్ బక్క స్వప్న మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గ్రామంలోని పలువురికి కండ్ల అద్దాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చెన్నబోయిన వెంకటేశం, డాక్టర్ మనిషా, సిహెచ్ఓ చంద్రశేఖర్, హెచ్ఈఓ సత్యనారాయణ, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.