Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం 10వ జాతీయ మహాసభలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా హౌరా పట్టణంలో ఈనెల 15 నుండి 19 జరుగగా ఈ మహాసభలలో తెలంగాణ రాష్ట్రం నుండి ఎన్నికైన సభ్యులలో కొండమడుగు నర్సింహ జాతీయ జనరల్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకున్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలో బీజేపీి ప్రభుత్వం ఎత్తివేయాలని కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. ఆ కుట్రలో భాగంగానే ఇప్పటికే డిజిటల్ హాజరును తప్పనిసరి చేసిందని మరోపక్క ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉపాదానికి కేటాయింపులను రూ. 30 వేల కోట్లకు తగ్గించిందని తెలిపారు. మరోపక్క ఆధార్ ఆధారిత వేతన చెల్లింపులకు సిద్ధమైందని దీంతో ప్రభుత్వ డేటా ప్రకారమే 57శాతం మంది కార్మికులు వేతనాలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణనకు వ్యతిరేకంగా, ప్రజా పంపిణీ వ్యవస్థను కాపాడాలని, విద్య, వైద్యం, ఉపాధికి నిధులు కేటాయించాలని దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించి ఏప్రిల్ 5 చలో పార్లమెంటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ కూలీలు, పేదలు, ఉపాధి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.