Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలయ ప్రారంభం తర్వాత తొలిసారి కొండపైన ఉత్సవాలు
- కళ్యాణం రోజు పట్టు వస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి
నవతెలంగాణ- యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుండి ప్రారంభం కానున్నాయి.11 రోజులపాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు.ఆలయ ఉద్గటణ అనంతరం తొలిసారి కొండపైన నిర్వహిస్తున్న బ్రహ్మౌత్సవాలకు కోటి 50 లక్షలు బడ్జెట్ను కేటాయించినట్టు తెలిసింది.కొండపైన విద్యుత్ దీపాల అలంకరణ,ఆలయంలో పుష్పాలంకరణను చేపట్టారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వీఐపీలకు కూడా దేవస్థానం అధికారులు ఆహ్వానాలు పంపారు.మంగళవారం ఉదయం 10 గంటలకు స్వస్తివచనంతో ప్రారంభమయ్యే బ్రహ్మౌ త్సవాలు మార్చ్ 3న శతకటాభిషేకంతో ముగుస్తాయి. బ్రహ్మౌత్సవాల్లో ముఖ్య ఘట్టాలుగా పేర్కొనే ఎదుర్కొలు ను ఈనెల 27న తిరు కళ్యాణమును ఈనెల 28న రథోత్సవాన్ని 29న అత్యంత వైభవంగా చేపట్టనున్నారు. తిరు కళ్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబ సమేతంగా హాజరై పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.బ్రహ్మౌత్సవాల్లో సామాన్య భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నట్లు గీతారెడ్డి తెలిపారు.