Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ -బీబీనగర్
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం ఆగదని గ్రామపంచాయతీ కార్మికుల యూనియన్ గౌరవ అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 12న పాలకుర్తి నుండి ప్రారంభమైన పాదయాత్ర ఆదివారం సాయంత్రం యాదాద్రిభువనగిరి జిల్లా బీబీనగర్ మండలానికి చేరుకుంది. సోమవారం మండల కేంద్రంలో పాటు రహింఖాన్ గూడ, రాఘవాపురం, వెంకీర్యాల, మక్త అనంతరం, గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగింది, సందర్భంగా వెంకిర్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ పాదయాత్ర పూర్తి అయ్యేవరకు ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనమివ్వాలని డిమాండ్చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గ్యార పాండు, చాగంటి వెంకటయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైళ్ల గణపతి రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వినోద్ కుమార్, మహేష్ సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరు మల్లేశం, గ్రామపంచాయతీ యూనియన్ రాష్ట్ర మహిళా కన్వీనర్ పోట్ట యాదమ్మ, మండల కార్యదర్శి మంద యాదగిరి, యూనియన్ జిల్లా అధ్యక్షుడు బందెల బిక్షం, సిల్వర్ రమేష్, సీఐటీయూ నాయకులు గాడి శ్రీనివాస్, బండార శ్రీరాములు, కందాడి దేవేందర్ రెడ్డి, అంగన్వాడీ యూనియన్ నాయకులు షాహేద, పద్మ, అరుణ, తిరుమల జ్యోతి, జిఎంపిఎస్ నాయకులు ఎల్లంమల సత్యనారాయణ, సయ్యద్ ఉమార్, తదితరులు పాల్గొన్నారు.