Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి
- కలెక్టర్ ఎస్.వెంకట్రావ్
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ప్రజావాణిలో అర్జీదారులు అందచేసిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో ఆదనవుకలెక్టర్లు పాటిల్ హేమంతకేశవ్, ఎస్.మోహన్‌రావులతో కలిసి పాల్గొని అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన వెబెక్స్ ద్వారా ఆయా రెవెన్యూ డివిజన్ల వారీగా ఆర్డీఓలు, సంబంధిత తహసీల్దార్లతో అర్జీదారులు చేసుకున్న వివిధ సమస్యలపై అడిగి తెలుసుకొని సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు.అన్ని మండలాల ఎంపీడీఓలు, తమసీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని వెబెక్స్ ద్వారా ఆయా మండలాల ప్రజా సమస్యలపై సమాధానం తెలపాలని సూచించారు.జిల్లాలో ఈ వేసవిలో ఎక్కడా నీటిఎద్దడి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ప్రజావాణిలో భూసమస్యల దరఖాస్తులు 33,డీఆర్డీఏ 18, ఇతర శాఖల దరఖాస్తులు 10 అందాయన్నారు.అట్టి దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.త్వరలో జిల్లా కార్యాలయాల్లో ఈ ఆఫీస్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ ఆఫీస్ విధివిధానాలు తదితర అంశాలపై జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంతకేశవ్, ఎస్.మోహన్‌రావులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి ఒకటి నుండి ఈ ఆఫీస్ విధానాన్ని ప్రారంభిస్తామన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ఆఫీసులలో ఈ ఆఫీస్ ప్రారంభిస్తామన్నారు.మొదటగా ఈ నెల 26న జిల్లా కలెక్టరేట్లో ఈ ఆఫీస్ సేవలను ప్రారంభిస్తామని చెప్పారు.మార్చి ఒకటి నుండి కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో, జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో ఈ ఆఫీస్ సేవలు విస్తరణ చేపడ్తామన్నారు.నెల రోజుల అనంతరం జిల్లాలోని ఎంపీడీఓ ఆఫీస్‌తో పాటు అన్ని ఆఫీసులలో రెండోవిడత ఈ ఆఫీస్ విధానం ప్రారంభమవుతందన్నారు.ఇందుకు జిల్లాలోని అధికారులు, సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తామన్నారు. ఆఫీస్ ఫైలింగ్ విధానం ఈ ఆఫీస్ సులభంగా ఉంటుందని తెలిపారు.ఏడేండ్లుగా ఇతర జిల్లాల్లో ఈ ఆఫీస్ విజయవంతంగా నిర్వహిస్తున్నారని, ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.అధికారులు ఆఫీసులకు సంబంధించిన సమాచారాన్ని ఈవో కలెక్టరేట్‌కు అందించాలని సూచించారు.ఈ ఆఫీస్ నిర్వహణ కోసం ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్, ఇతర సిబ్బందిని నియమిస్తామన్నారు.జిల్లాలో పని చేస్తున్న అన్ని కార్యాలయాల పూర్తి సమాచారం, విధి విధానాలు గూగుల్ తెలుగులో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయంలో సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ సురేష్, డీఎఫ్ఓ సతీష్,డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, సీపీఓ వెంకటేశ్వర్లు, డీఈఓ అశోక్, డీఏఓ రామారావునాయక్, డీహెచ్ఓ శ్రీధర్‌గౌడ్, ఐసీడీఎస్ పీడీ జ్యోతిపద్మ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.