Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గ్రామ పంచాయితీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ నెల 12 నుండి జనగామ జిల్లా పాలకుర్తి సీఐటీయూ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పాలడుగు భాస్కర్ నేతత్వలోని ఏడు బృందంలు చేస్తున్న పాదయత్రకి మద్దతుగా సోమవారం సూర్యాపేట జిల్లాలోని కూడా కూడా నుంచి పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో 475 గ్రామ పంచయతీల్లో 1745 మంది కార్మికులు మల్టీపర్పస్ వర్కర్లుగా 2018 నుండి పని చేస్తున్నారని తెలిపారు.ఇటీవల కాలంలో కొన్ని గ్రామ పంచాయతీల జనాభా పెరిగిందని, అదనపు సిబ్బందిని పెట్టుకున్నారని తెలిపారు.గ్రామపంచాయతీల్లో పని చేసే సిబ్బంది సామాజికంగా వెనకబడిన తరగతులకు చెందిన ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలేనని పేర్కొన్నారు.కార్మికులకు అందజేస్తున్న రూ.8500తో పూట గడవని పరిస్థితి ఉందన్నారు.జీవో నెంబర్ 60 ప్రకారం పీఆర్సీ అమలు చేయాలన్నారు.అలాగే ప్రతినెలా వేతనాలు అకౌంట్లో జమ చేయాలని కోరారు. ఇప్పటికే మూడూ నెలల నుండి కొన్ని గ్రామపంచాయతీల సిబ్బందికి వేతనాలు అందడం లేదన్నారు.కనీసవేతనం నెలకు రూ.26000 ఇవ్వాలని, జీవో నెంబర్ 2/94ను రద్దు చేసి సిబ్బందిని పర్మినెంట్ చేయాలని కోరారు.జీవో నెంబర్ 60 ప్రకారం రూ.15600 వేతనం ఇవ్వాలని డిమాండ్ డిమాండ్ చేశారు.గ్రామ పంచాయతీ కార్మికుల రాష్ట్రసహాయ కార్యదర్శి సోమపంగు రాధాకష్ణ మాట్లాడుతూ గ్రామ పంచయతీ కార్మికుల సమస్యల పరిష్కారము కొరకు జరుగుతున్నా పాదయాత్ర హైదరాబాద్ చేరుకుంటుందని, అదేరోజు మూకుమ్మడిగా వందలాది మంది ఈ నెల 28 ఛలో హైదరాబాద్కు తరలివచ్చి ఇందిరాపార్క్ వద్ద జరుగు మహాధర్నాలో పాల్గొనాలని కోరారు.అనంతరం జిల్లాలోని అన్నీ మండలాల గ్రామ పంచాయతీలలో పనిచేసే కార్మికులు సుమారు 200 మంది వల్లభాపురం నుండి పాదయాత్రగా బయల్దేరి కలెక్టరేట్ కార్యాలయం వరకు నడిచి ధర్నా నిర్వహించారు.కలెక్టర్ ఎస్.వెంకట్రావుకు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ధర్నాకు ధనియాకుల శ్రీను అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.రాంబాబు, గ్రామ పంచాయతీ నాయకులు సైదులు, చిమట నాగరాజు, సురేష్, వెంకన్న, భిక్షం,రాంబాబు, రామారావు, గుర్వమ్మ,నకిరేకంటి నర్సయ్య, సైదులు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు మామిడి సుందరయ్య, సాయికుమార్, బచ్చలకూర స్వరాజ్యం, మల్లెలవెంకన్న, సిద్దు, విజరుకుమార్, తదితరులు పాల్గొన్నారు.