Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
వాసవిక్లబ్లు తమ సేవలను విస్తరించాలని, మరింతగా పేద ప్రజలకు సేవలందించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.ఆదివారం రాత్రి స్థానిక రవి ఫంక్షన్‌హాలులో జరిగిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 104 డిస్ట్రిక్ట్, వాసవి క్లబ్ సూర్యాపేట, ఇతర క్లబ్‌ల నూతన కమిటీల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.వాసవిక్లబ్ల ద్వారా నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు వ్యాపారం కోసం వడ్డీ లేని రుణాలివ్వడం హర్షణీయమన్నారు.చనిపోయిన ఆర్యవైశ్య కుటుంబానికి వాసవి కుటుంబ సంక్షేమపథకం ద్వారా రూ.5 నుండి రూ.10 లక్షల వరకు సహాయం చేయడం గొప్పవిషయమన్నారు.స్వచ్ఛందసంస్థలు సేవ చేయడానికి అనేక అవకాశాలు వుంటాయన్నారు.కానీ ప్రభుత్వపరంగా సహాయం చేయడానికి అనేక నియమ నిబంధనలు అడ్డు వస్తాయని తెలిపారు.ప్రభుత్వం సహాయం చేయలేని చోట వాసవి క్లబ్ వంటి స్వచ్ఛందసంస్థలు సహాయం చేసి ప్రజలను ఆదుకోవాలని కోరారు.పట్టణంలో తమ వంతు సేవలు అందిస్తున్న వాసవి క్లబ్ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.అనంతరం సేవా కార్యక్రమంలో భాగంగా ఎన్సీసీ విద్యార్దులకు మంత్రి చేతులమీదుగా షూలు పంపిణీ నిర్వహించారు.అంగన్వాడీలకు ఆర్థికసాయం అందజేశారు.నిరుపేద మహిళలకు వాసవి క్లబ్ ప్రెసిడెంట్ బెలిదె శ్రీనివాస్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సెక్రెటరీ ఇరుకుల రామకృష్ణ, యాదా నాగేశ్వరరావు చైర్మన్ ఫైనాన్స్, ఎన్నికలు, ప్రాజెక్టులు వాసవి క్లబ్‌ల ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ చైర్మెన్ సోమా భరత్‌కుమార్, బీఆర్ఎస్ పట్టణఅధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్, ఉప్పల ఆనంద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలితాదేవిఆనంద్, ప్రముఖ పారిశ్రామిక వేత్త మీలామహదేవ్, మీలావాసుదేవ్, బండారు రాజా, కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్, గోండ్రాల అశోక్, చల్లా లక్మికాంత్, కలకోట లక్ష్మయ్య, రాచకొండ శ్రీనివాస్, జిల్లా గవర్నర్ వంగవేటి గురుమూర్తి, సింగిరికొండ రవీందర్, బండారు సత్యనారాయణ, తోట శ్యామ్‌ప్రసాద్, గుండా శ్రీదేవి, రాచర్ల కమలాకర్, కో ఆప్షన్‌సభ్యులు వెంపటి సురేష్, పివివి లక్ష్మినారాయణ, గుండా శ్రీధర్, తల్లాడ సోమయ్య, గుండా ఉపేందర్, పబ్బతి ప్రవీణ్, పబ్బతి వేణుమాధవ్, బండారు రమేష్, గుండా మురళి పాల్గొన్నారు.
పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సంక్షేమ కార్యక్రమాలు
పేదల జీవితాల్లో వెలుగులను నింపాలని రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు.సోమవారం స్థానిక మంత్రి క్యాంప్ ఆఫీస్ పక్కనగల మార్కెట్‌యార్డులో జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ద్వారా చిరు వ్యాపారులకు చెక్కులు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు.జిల్లాలోని 282 షెడ్యూల్ కులాల నిరుపేదలకు,చిరువ్యాపారులకు పంపిణీ చేస్తాన్నారు.నియోజకవర్గంలోని 84 మంది లబ్దిదారులకు ఒక్కొక్కరికి 50 వేల రూపాయల చొప్పున చిరు వ్యాపార నిమిత్తం చెక్కులను అందజేస్తున్నామన్నారు.దీనిలో ఏడుగురు కుట్టుమిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, వారికి కూడా ఏడు కుట్టుమిషన్లు అందజేస్తామన్నారు.అన్ని వర్గాల వారికి అండగా ఉంటూ అనేక సంక్షేమకార్యక్రమాలు ఏర్పాటు చేసి దళిత కుటుంబాలను ఆదుకుంటుందని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం రాకముందు రాష్ట్ర పరిస్థితి, ఏర్పడిన తర్వాత అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారని పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు అన్ని రంగాలలో అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.ఇచ్చిన పైసాను పొదుపు చేసి అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తారన్నారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల అన్నపూర్ణ, జెడ్పీ వైస్‌చైర్మెన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, సూర్యాపేట జెడ్పీటీసీ జీడిభిక్షం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ ఉప్పల లలిత ఆనంద్, పెన్పహడ్ ఎంపీపీ నెమ్మాది భిక్షం, జెడ్పీటీసీ అనిత, చివ్వెంల జెడ్పీటీసీ సంజీవ్‌నాయక్, డీఆర్ఓ రాజేంద్రకుమార్, మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బి.శిరీష పాల్గొన్నారు.