Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ఉపాధి హామీ చట్టం కింద 2018-19 ఆర్థిక సంవత్సరంలో 100 రోజులు పూర్తిచేసిన కుటుంబాలు వర్మీ కంపోస్ట్ ఎరువు, నర్సరీ లైబ్రరీ నైపుణ్య శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ పీడీ ఉపేందర్ రెడ్డి, ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్, జెడ్పీటీసీసుబ్బురు బీరు మల్లయ్య మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జీవన ఉపాధిని ఆదాయ మార్గాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఉన్నతి ప్రాజెక్టులో భాగంగా శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఆర్డిఓ నాగిరెడ్డి, డిప్యూటీ సి ఈ ఓ శ్రీనివాసరావు, ఎంపీడీవో గుత్తా నరేందర్ రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి శాస్త్రవేత్త నరేష్, డిపిఎం రాజు, ఏపీవో బాలస్వామి, జేఆర్పీలు పాల్గొన్నారు.