Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చౌటుప్పల్ రూరల్
ఎమ్మార్పీఎస్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చట్టరీత చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు చౌటుప్పల్ సీఐ మల్లికార్జున్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు బోయ దేవేందర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకై మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎమ్మార్పీఎస్ ఉద్యమం చేస్తుందని గుర్తు చేశారు. అనేక సామాజిక అంశాలపై ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న ఎమ్మార్పీఎస్ పేరుతో ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తులు అక్రమ వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి చెడ్డ పేరు తెస్తూ, ఉద్యమాన్ని బలహీన పరుస్తున్న అక్రమ వసూలు దారులపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో చౌటుప్పల్ మున్సిపల్ కౌన్సిలర్ బండమీది మల్లేశం, నాయకులు ఎర్ర ఉషయ్య, ఊదరి శ్రీనివాస్, బద్రి గాలయ్య, ఊదరి నరసింహ, ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ బోయ లింగస్వామి తదితరులు ఉన్నారు.