Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ- భూదాన్‌పోచంపల్లి
రాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్మికులకు నాలుగువేల వేతనం ఇవ్వడం సిగ్గుచేటు ఆరకొర జీతాలతో కుటుంబాలను ఎలా నెట్టుకొస్తారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకవైపు పల్లె ప్రకృతి వనాల శుభ్రత మరోవైపు మోరీల సఫాయి వంటి పనులన్నీ పంచాయతీ కార్మికుల వల్లే సాధ్యమేనా అని ప్రశ్నించారు. గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సీఐటీయూ ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్ర సోమవారం మండలంలోని పిల్లాయిపల్లి గ్రామంలో కొనసాగింది. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్ 200 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్ పార్టీ షర్మిల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజరు చేసే పాదయాత్రలు అధికారం కోసం ఎమ్మెల్యేల సీట్ల కోసం ప్రజల కోసం కాదు కార్మికుల కోసం కాదు సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర కార్మికుల ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్నాం అధికారం కోసం కాదన్నారు. మున్సిపల్ కార్మికులకు ఇచ్చే విధంగానే గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండు పర్యాయాలు ఎన్నికల మేనిఫెస్టోలో అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేస్తానని టీఆర్ఎస్ హామీ ఇచ్చి విస్మరించిందన్నారు. కరోనా సమయంలో చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగం ఎస్గేసియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఏడాది దుస్తులతో పాటు మాస్కులు బ్లౌజులు తోపుడు బండ్లు అందించాలన్నారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దుచేసి కారోబార్ బిల్లు కలెక్టర్ ప్రత్యేక హోదా కల్పించాలని కోరారు. మేజర్ గ్రామపంచాయతీ కార్మికులకు మూడు నెలలుగా చిన్న గ్రామపంచాయతీ కార్మికులకు ఏడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో వారి కుటుంబాలు గడవడం కష్టంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నిధులు విడుదల చేసి వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాదయాత్రలో గ్రామపంచాయతీ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పైల గణపతి రెడ,ి్డ రాష్ట్ర కార్యదర్శులు వినోద్ కుమార్ ,మహేష్, పాదయాత్ర బృందం సభ్యులు సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సుధాకర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కల్లూరి మల్లేశం కోమటిరెడ్డి చంద్రారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు దాసరి పాండు, గూడూరు అంజిరెడ్డి పగిల లింగారెడ్డి మంచాల మధు ,గ్రామపంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.