Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
అంతర్జాతీయ భాషాదినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆడిటోరియంలో మంగళవారం పోటో ఎగ్జిబిషన్ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖా సహాకారంతో నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ రేగట్టే మల్లిఖార్జున్‌రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యలయంలో పోటో ఎగ్జిబిషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యుత్‌శాఖా మంత్రి జగదీశ్‌రెడ్డి పోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషతు చైర్మెన్ బండ నరేందర్‌రెడ్డి, నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డితోపాటు ఇతర శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గోననున్నట్లు చెప్పారు. యూనస్ ఫరాన్ సేకరించిన నల్లగొండ జిల్లా ప్రజల భాషా, సాంస్కృతిక, జీవనవిధానం తెలిపే వంద సవంత్సరాల నాటి సూమారు 500 ఛాయచిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ, తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖా అంతర్జాతీయ భాషాదినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న పోటో ఎగ్జిబిషన్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గోని విజయవంతచేయలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖా ప్రతినిధి యూనస్ ఫరాన్, సీనియర్ అసిస్టెంట్ ఎన్. నర్సింహ్మారెడ్డి, అసిస్టెంట్ లైబ్రేరియన్ కట్ట నాగయ్య, గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు.