Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల్లో లబ్ధి పొందెందుకే దరఖాస్తుల స్వీకరణ
- ఇండ్లు పంపిణీ చేసి హామీని నిలబెట్టుకోవాలి
- చెవిలో కాలిఫ్లవర్ పెట్టుకుని మాజీ ఎమ్మెల్యే రేపాల నిరసన
నవతెలంగాణ-మిర్యాలగూడ
ప్రజలను మోసం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని, వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దరఖాస్తుల స్వీకరణ చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే రేపల్లె శ్రీనివాస్ ఆరోపించారు. సోమవారం పట్టణంలోని నవజీవన్ స్కూల్ దరఖాస్తులు స్వీకరణ కేంద్రం వద్ద అర్ధ నగంతో చెవులో కాలిఫ్లవర్ పెట్టుకొని డప్పులు కొట్టుకుంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ తెరపైకి తెచ్చారని విమర్శించారు. పట్టణ శివారులో కేవలం 540 మాత్రమే నిర్మించారని, ఇప్పుడు వేలాది దరఖాస్తులు వస్తున్నాయని ఎంతమందికి ఇల్లు పంచుతారని ప్రశ్నించారు. 9 ఏళ్ల కాలంలో అమలు కానీ హామీలను ఒకేసారి అమలు చేస్తున్నట్లు ప్రజల మభ్యపెడుతున్నాడని చెప్పారు. ఆయా ప్రాంతాలలో గ్రామాలలో తక్కువ ఇండ్లు నిర్మిస్తున్నారని అక్కడ ఉన్న పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. ప్రజల చెవిలో పూలు పెట్టి కేసీఆర్ మోసం చేస్తున్నాడని ప్రజలకు గమనించాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్కటి హామీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. రైతులకు లక్ష రుణమాఫీ పూర్తిగా చేయాలని, ఉద్యోగాలు వచ్చేంతవరకు నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు రైతుబంధు పథకం వర్తింపచేయాలని, అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ నిర్మించి ఇవ్వాలని, స్థలం ఉన్న వారికి ఐదు లక్షల ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పొలగాని వెంకటేష్ గౌడ్, హరి ప్రసాద్, నాగేశ్వరరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.