Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
దేవరకొండ నియోజక వర్గం పరిధిలో ఏఎంఆర్పీ ప్రాజెక్ట్, డిండి ఎత్తి పోతల పథకం కింద నిర్మిస్తున్న రిజర్వాయర్ల భూ సేకరణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ టీ.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దేవరకొండ శాసన సభ్యులు రవీంద్ర కుమార్‌తో కలిసి నియోజక వర్గ పరిధిలో ఏఎంఆర్పీ ప్రాజెక్ట్, డిండి ఎత్తిపోతల పథకం కింద భూ సేకరణ, ఆర్ అండ్ ఆర్, పొడు భూములపై సమీక్షించారు. భూ సేకరణ వేగ వంతం చేయాలని, భూ నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లింపు చేయాలని, ఆర్ అండ్‌ఆర్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రాజ్ కుమార్, రెవెన్యూ, అటవీ అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ టీి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులను సమావేశ పరచి అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుతో కలిసి ప్రజల నుండి పిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణి సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి పిర్యాదు దారులు 55 పిర్యాదులు అందించారని, వాటిలో ధరణికి సంబంధించిన భూ సమస్యలపై, ఆసరా పెన్షన్లు, ఇతర సమస్యలకు సంబంధించి దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పిర్యాదు దారులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీఎం శ్రీనివాసులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.