Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నవతెలంగాణ -రామన్నపేట
మండలంలోని నిదాన్ పల్లి గ్రామంలో శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఉన్న మల్లన్న గుట్టను ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాల్సిన అవసరం ఉందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం తెల్లవారుజామున బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన అగ్నిగుండాలు కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లన్న గుట్టపై సువిశాలమైన ప్రదేశం ఉందని, ఎంతో ఆలహరకరమైన ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక కేంద్రం ఉండాలన్నదే తన సంకల్పమని ఇందుకోసం ఇప్పటికీ తన సొంత నిధులు 10 లక్షల రూపాయల వరకు వెచ్చించానని తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జ్ దైద రవీందర్, మండల అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, చిట్యాల మండల అధ్యక్షుడు గుడిపాడు లక్ష్మీనరసింహ, కేతేపల్లి పిఎసిఎస్ చైర్మన్ బోళ్ల వెంకట్ రెడ్డి, మాజీ పిఎసిఎస్ చైర్మన్ గార్లపాటి రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు మందడి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఉన్నారు.